London Arson Attack: లండన్‌లో భారతీయ రెస్టారెంట్‌కు నిప్పు..సీసీ కెమెరాల్లో సంచలన దృశ్యాలు

శుక్రవారం లండన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ఒక భారతీయ రెస్టారెంట్‌కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

New Update
London Arson Attack

London Arson Attack

London Arson Attack:  శుక్రవారం లండన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి ఒక భారతీయ రెస్టారెంట్‌(Indian Restaurant) కు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ ఘటనలో అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెస్టారెంట్‌కు నిప్పు పెట్టిన సందర్భంలో ఐదుగురు వ్యక్తులు గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఒకటీనేజర్‌ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తూర్పు లండన్‌ నగరంలోని ఉడ్‌ఫోర్డ్ ఎవెన్యూలో ఉన్న ఇండియన్ అరోమా(Indian Aroma) అనే రెస్టారెంట్‌లో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దుండగులు రెస్టారెంట్‌లో నిప్పు రాజేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read :  కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాం.. రేవంత్ సంచలన ప్రకటన!

గత శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో  ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ కస్టమర్లతో నిండి ఉన్న సమయంలో ఈ అటాక్‌ జరిగింది. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, మాస్కులు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రెస్టారెంట్‌లోపలికి వెళ్లి అక్కడ నేలపై అనుమానిత ద్రవాన్ని జల్లి ఆ తర్వాత నిప్పంటించారు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే గది అంతా మంటలు వ్యాపించాయి. దీంతో, ఒక్కసారిగా రెస్టారెంట్‌లో కలకలం చెలరేగింది. సిబ్బంది, కస్టమర్లు అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు. మంటలనుంచి తమను తాము కాపాడుకునేందుకు,  ప్రాణాలు దక్కించుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో దుస్తులకు నిప్పంటుకున్న ఓ వ్యక్తి బయటకు పరుగుతీసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారాయి.

కాగా ఈ సంఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు గాయపడినట్లు తెలుస్తోంది.  సమాచారం అందినే వెంటనే అక్కడకు చేరుకున్న వైద్య సిబ్బంది బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ సందర్భంగా గాయపడిన వారిలో ఒక మహిళ, మరో పురుషుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  అదే సందర్భంలో  గాయపడ్డ మరో ఇద్దరు కస్టమర్లు.. వైద్య సిబ్బంది వచ్చే లోపే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే వారు ఎవరన్నది తెలియరాలేదు. సీసీ ఫుటేజీ ఆధారంగా వారిని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్టారెంట్‌ నిర్వహకుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  మంటలను ఆర్పేందుకు గంటన్నరకు పైగా సమయం పట్టినట్లు తెలుస్తోంది. ‘ఒంటికి నిప్పు అంటుకోవడంతో ఓ వ్యక్తి హాహాకారాలు చేస్తూ బయటకు పరిగెత్తడాన్ని తాను చూశానని మరో కస్టమర్ డీనా మైఖేల్ తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా ఘటనకు సంబంధించి 15 ఏళ్ల టీనేజర్‌ను, 54 ఏళ్ల పురుషుడిని అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరే రెస్టారెంట్‌లో నిప్పు రాజేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రెస్టారెంట్‌లో ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సెంట్రల్ స్పెషలిస్టు క్రైమ్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.

Also Read : చిన్నారుల మెదడు కంప్యూటర్‌లా వేగంగా పని చేయాలా..? ఈ డ్రైఫ్రూట్స్‌ తినండి!!

Advertisment
తాజా కథనాలు