TG: తెలంగాణలో చలి పులి పంజా..రానున్న ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి సుమా

తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.

New Update
fog telangana

fog telangana

Telangana: తెలంగాణలో చలిపులి మరోసారి విజృంభిస్తోంది.చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. చలికి జనం గజగజ వణికిపోతున్నారు. ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. చలికితోడు పొగమంచి కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రికార్డుల స్థాయిలో సింగిల్‌ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Also Read: TG News: కలెక్టరేట్‌లో రసాభాస.. అందరిముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు!

చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీలకు...

ముఖ్యంగా ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.హైదరాబాద్ నగరంతో పాటుగా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలికి తోడు పొగమంచు కూడా దట్టంగా వ్యాపిస్తుంది. దీంతో ఉదయం వేళల్లో ప్రయాణాలు సాగించేవారు రోడ్డు కనిపించకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: బీఆర్ఎస్ పార్టీపై దాడికి కారణమిదే: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

 రాబోయే రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. ఐదు రోజుల పాటు పొగ మంచు చాలా ఎక్కువగా ఉంటుందని వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండక్కి ఊర్లు వెళ్లేందుకు చాలా మంది ఉదయం వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పొగమంచు దట్టంగా వ్యాపించి ఉండటంతో  ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిదని అంటున్నారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న క్రమంలో చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు వహించాలని  సూచిస్తున్నారు. ఎండ వచ్చేవరకు బయటకు రాకూడదని డాక్టర్లు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, రెండేళ్లలోపు చిన్నారులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

Also Read: Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్‌లు.. లిస్ట్ ఇదే!

Also Read: BIG BREAKING: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ముప్పు.. పేలిన కారు టైర్లు!

Advertisment
తాజా కథనాలు