TG News: కలెక్టరేట్‌లో రసాభాస.. అందరిముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు!

కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరగటంతో తోపులాటకు దారితీసింది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. 

New Update
karimnagar

Sanjay and Kaushik Reddy

TG News: కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరగటంతో తోపులాటకు దారితీసింది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. 

సంజయ్ మాట్లాడుతుండగా.. 

ఈ మేరకు సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగా సంజయ్‌ది ఏ పార్టీ అంటూ కౌశిక్ నిలదీయడంతో గొడవ మొదలైంది. దీంతో ఒకరిపైకి ఒకరు దూసుకురాగా అక్కడుతన్న వారంతా అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆగకుండా కౌశిక్ రెడ్డి ముందుకు దూసుకెళ్లడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పరస్పరం చేయి చేసుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీసులు బయటకు తీసుకెళ్లారు. అయితే ఈ సమావేశఃలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు ఉండటం గమనర్హం. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

కేసీఆర్ పెట్టిన భిక్ష..

ఇక 'కేసీఆర్ పెట్టిన భిక్షతోని గెలిచి సిగ్గులేకుండా పార్టీ మారిండని సంజయ్ పై కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. అన్నం తింటుండా లేక పెండ తింటుడా? దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవమని చెప్పుమనండి. అంతపెద్ద మోగోడైతే రాజీనామా చేయాల్సిందే. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను ఎక్కడికెళ్లిన అడ్డుకుంటాం. వారిని తిరగనివ్వం' అంటూ కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు.

ఇది కూడా చదవండి: MLC Kavitha: సీఎం రేవంత్ మూలాలు అక్కడివే.. కవిత సంచలన ఆరోపణలు!

కౌశిక్ రెడ్డికి సిగ్గు లేదు..

ఇక కౌశిక్ రెడ్డిపై మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల సమావేశంలో దాడికి పాల్పడటంపై సిగ్గుండాలన్నారు. అందరూ పార్టీ మారినవారేనని, కౌశిక్ రెడ్డి కూడా పార్టీ మారిన విషయాన్ని మరిచిపోవద్దంటూ చురకలంటించారు.   

ఇది కూడా చదవండి: మంటల్లో హాలీవుడ్.. అసలేం జరిగింది? కార్చిచ్చుకు కారణం ఏంటి?

Advertisment
తాజా కథనాలు