/rtv/media/media_files/2025/11/19/fotojet-2025-11-19t122413343-2025-11-19-12-24-40.jpg)
I couldn't feed him when he was alive, and when he died.
Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు ఓ కన్న తండ్రి. వివరాల ప్రకారం..మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తి మిల్లులో పని చేస్తూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తూ జీవనం సాగించాడు బాలరాజ్ అనే వ్యక్తి.
Also Read: ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు
బ్రతుకున్నప్పుడు తిండి పెట్టలేకపోయాను, చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను!
— Volga Times (@Volganews_) November 19, 2025
మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక సంఘటన
కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్న కన్న తండ్రి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తి… pic.twitter.com/EhIUfw3fFP
Also Read: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!
ఇటీవల పత్తి మిల్లు మూతపడి ఉపాధి కోల్పోయాడు. పెద్దకుమారుడు హరీశ్(8) అవయవ లోపం, మానసిక వైకల్యంతో జన్మించాడు. బాలరాజ్ కు పనిలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో భార్యతో తరచూ గొడవలయ్యేవి. దీంతో భర్త, దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి, చిన్న కుమారుడితో పుట్టింటికి వెళ్లిపోయింది భార్య. అయితే సరైన తిండి లేక అనారోగ్యానికి గురై దివ్యాంగుడైన కుమారుడు మృతిచెందాడు.. అతన్ని ఖననం చేయడానికి తండ్రి చేతిలో చిల్లిగవ్వ లేదు.. మృతదేహాన్ని భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లాడు..
Also Read: శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషం! ..ప్యాంట్ జిప్ విప్పి
అక్కడ సాయానికి ఎదురుచూస్తూ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని 8 గంటలపాటు ఎదురుచూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ హృదయవిదారక ఘటన అందరిని కలిచివేసింది. కాగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జడ్చర్లకు చెందిన వీఆర్ సామాజిక సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సంస్థ ప్రతినిధి ప్రవీణ్.. వాలంటీర్లతో సాయంత్రం 7 గంటలకు స్మశాన వాటికకు చేరుకొన్నాడు. అనంతరం పొక్లెయిన్‌తో గుంత తీయించి.. ఖననం చేశారు. కాగా 4 రోజులుగా ఆహారం లేక ఇద్దరం నీరు తాగి ఉన్నామని, తన కొడుకు చనిపోగా, తాను అనారోగ్యాని గురయ్యానని బాలరాజ్ కన్నీటి పర్యంతమవ్వడం అందరినీ కదిలించింది.
Also Read: పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..
Follow Us