ట్రైన్లో ప్రసవించిన మహిళ
గర్భిణి ట్రైన్లో డెలివరీ అయింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మహమూదా బేగం తన కూతురు అర్సియా అభస్సుం బేగంతో బంధువుల ఇంటికి బయలు దేరగా.. మార్గ మధ్యలో అర్సియా అభస్సుం బేగంకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో తోటి ప్రయాణికులు ప్రసవం చేశారు.