PM Narendra Modi : పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రేమ, సేవకు సత్యసాయిబాబా ప్రతిరూపంగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి అంటూ కొనియాడారు. బాబా జీవితం వసుదైక కుటుంబం అన్నట్లుగానే సాగిందన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవానికి ఆయన హాజరయ్యారు.

New Update
FotoJet - 2025-11-19T125324.197

Puttaparthi is the spiritual land..Prime Minister Modi's key comments

PM Narendra Modi : ప్రేమ, సేవకు సత్యసాయిబాబా ప్రతిరూపంగా నిలిచారని ప్రధాని మోదీ అన్నారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి అంటూ కొనియాడారు. బాబా జీవితం వసుదైక కుటుంబం అన్నట్లుగానే సాగిందన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవానికి ఆయన హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. అనంతరం హిల్‌ వ్యూ స్టేడియానికి మోదీ చేరుకున్నారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌ తదితరులు హాజరయ్యారు.

Also Read: తన వాళ్ల కోసమే బ్రతికే మగ మహానుభావులందరికి హ్యాపీ మెన్స్ డే!!

కాగా ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ..మానవ సేవే.. మాధవ సేవ అని సత్యసాయి భావించారని, ఎన్నోకోట్ల మందిని బాబా మార్గదర్శనం చేశారన్నారు. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బాబా బోధనలు దేశమంతా ప్రభావం చూపించాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని అన్నారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తుచేశారు. అందరినీ ప్రేమించాలి.. అందరికీ సేవ చేయాలి.. ఇదే బాబా నినాదమని పేర్కొన్నారు.

Also Read: ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు

లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది ఆయన నినాదమని తెలిపారు. సత్యసాయి సందేశం పుస్తకాలు, ప్రవచనాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఒక్కరూ అనుసరించి, ఆచరించి ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.మానవ సేవే మాధవ సేవగా భావించే సత్యసాయిబాబు మనందరికీ స్ఫూర్తి అని తెలిపారు. పేదలకు ఆపదవస్తే ఆదుకోవడంతో బాబా సేవాదళ్ ముందుంటుందని కితాబిచ్చారు. గుజరాత్ లో భూకంపం సంభవించినపుడు ఆయన సేవాదళ్ సేవలందించిందని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలు దేశ, విదేశాలకు విస్తరించాయని తెలిపారు.

Also Read: శబరిమలలో ఏపీ భక్తులపై అమానుషం! ..ప్యాంట్ జిప్ విప్పి

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వికసిత్ భారత్ గా దేశం ముందుకెళ్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. పేదలకు అనేక పథకాలు అందించడంతో పాటు.. గో సంరక్షణ కోసం రాష్ట్రీయ గోకుల్ మిషన్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. సత్యసాయిబాబా స్ఫూర్తితో వోకల్ ఫర్ లోకల్ నినాదంతో మనమంతా ముందుకు సాగాలని మోదీ సూచించారు. మన ఉత్పత్తులను మనమే ప్రమోట్ చేసుకోవాలన్నారు.

Also Read: పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. బాబా జీవితం వసుదైక కుటుంబం..

అంతకుముందు స‌త్యసాయి బాబాతో ఉన్న సంబంధాల‌ను ప్రధాని గుర్తు చేసుకున్నారు. గ‌తంలో స‌త్యసాయి బాబాను క‌లిసిన దృశ్యాల‌ను మోదీ ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురుచూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి, ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి. మా సంభాషణల నుండి కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి అని మోదీ పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు