/rtv/media/media_files/2025/08/12/hydra-2025-08-12-19-52-41.jpg)
హైదరాబాద్ వాసులకు హైడ్రా(Hydra) కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశముందని హైడ్రా వెల్లడించింది. వచ్చే మూడ్రోజులు ప్రజలెవరూ బయటకు రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది. ముప్పు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు సూచించింది. 2025 ఆగస్టు 13,14,15 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వంటి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద ఉండవద్దని అధికారులు సూచించారు.
Also Read : HYDRA : హైదరాబాద్ వాసులకు హైడ్రా కీలక ప్రకటన
రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
మూడు రోజులపాటు భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు రోజులు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారుల సెలవులను రద్దు చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. అందరూ క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి, పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలు చేపట్టడం, వరద నీరు నిలిచిపోకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అత్యవసర సేవలు అందించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
#BREAKING
— News Vibe (@newsvibe107) August 12, 2025
🟥 NEWS VIBE
అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్
............
✅ భారీ వర్షాలపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
✅ అన్ని శాఖల అధికారులకు సెలవులు రద్దు
✅ అందరూ ఫీల్డ్లోనే ఉండాలి.
✅ సిటీలో హైడ్రా, జీహెచ్ఎంసీ సమన్వయం చేసుకోండి pic.twitter.com/EUsaeLGQKu
Also Read : నిజం సింహం లాంటిది.. KTR లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే