Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 9మంది అరెస్ట్
HYDలో డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్టసీ, తుపాకీ, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
HYDలో డ్రగ్స్ విక్రయిస్తున్న 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్టసీ, తుపాకీ, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్.. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ఆయన అడుగులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. సచివాలయం నుంచి ఖైరతాబాద్ వెళ్తుండగా కారు డివైడర్‌ను ఢీకొంది. కారు వెనుక టైర్లో గాలి తక్కువ ఉండటంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కారులో బెలూన్స్ తెరుచుకోవడంతో ఎవరూ గాయపడలేదు.
హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడానికి ఐటీ కంపెనీలు బుధవారం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలని సూచించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్‌నగర్ అలకనందా ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రాకెట్ కీలక సూత్రదారిగా భావిస్తున్న పవన్ ఎలియాస్ లియోన్ తెలంగాణ సీఐడీ పోలీసులకు చిక్కాడు.
ఫ్రిజ్‌లో ఉంచిన మటన్ ను వేడి చేసి తినడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా అతని ఫ్యామిలీలోని మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వనస్థలిపురం పీఎస్ పరిధి చింతల్‌కుంటలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
వామపక్ష విద్యార్థి సంఘాలు రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో నెలకొన్న ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల కొరత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో రేపు స్కూల్స్ మూతపడే అవకాశముంది.
హైదరాబాద్‌లో వర్షం ప్రారంభమైంది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, మెహదీపట్నం, చార్మినార్, సరూర్‌నగర్, మలక్‌పేట్, ఎల్బి నగర్, కంచన్‌బాగ్, బహదూర్‌పురా, సమీప ప్రాంతాలలో ఈదురు గాలులతో వర్షం జోరుగా కురుస్తోంది.