PM Modi Tour: మోదీ పర్యటనలో.. ఇండియా-జోర్డాన్‌‌ 5 కీలక ఒప్పందాలు ఇవే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల జోర్డాన్‌ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. గత 37 ఏళ్లలో ఓ భారత ప్రధాని జోర్డాన్‌లో జరిపిన మొట్టమొదటి పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం.

New Update
joordan

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల జోర్డాన్‌ పర్యటన ఇరు దేశాల మధ్య ఆర్థిక, దౌత్య సంబంధాలను(India-Jordan economic ties) మరింత బలోపేతం చేసింది. గత 37 ఏళ్లలో ఓ భారత ప్రధాని జోర్డాన్‌లో జరిపిన మొట్టమొదటి పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన(PM Modi Tour) ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా IIతో ప్రధాని జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఫలితంగా 5 కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

Also Read :  వైట్ హౌస్ కాల్పులు.. ఈ 5 దేశాల పౌరులు అమెరికాలోకి నో ఎంట్రీ!

ఐదు కీలక ఒప్పందాలు

పునరుత్పాదక ఇంధనం: కొత్త, పునరుత్పాదక ఇంధన రంగంలో సాంకేతిక సహకారం కోసం ఇరు దేశాలు అంగీకరించాయి. ఇది స్వచ్ఛమైన ఇంధన వనరుల అభివృద్ధికి తోడ్పడుతుంది.
జల వనరుల నిర్వహణ: నీటి సంరక్షణ, యాజమాన్యం, అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి.
డిజిటల్ పరివర్తన: భారతదేశంలో విజయవంతమైన 'డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' జోర్డాన్‌లోనూ అమలు చేసేలా సాంకేతికతను పంచుకోవడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు.
సాంస్కృతిక మార్పిడి: 2025 నుంచి 2029 వరకు సాంస్కృతిక సంబంధాలను మెరుగుపరిచేందుకు గతంలో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించారు.
పెట్రా -ఎల్లోరా ట్విన్నింగ్ ఒప్పందం: ప్రపంచ వారసత్వ సంపదగా పేరొందిన జోర్డాన్‌లోని 'పెట్రా', భారత్‌లోని 'ఎల్లోరా' గుహల మధ్య పర్యాటక, వారసత్వ సంరక్షణ కోసం 'ట్విన్నింగ్' ఒప్పందం కుదిరింది.

Also Read :  ఆస్ట్రేలియా ఉగ్రదాడిపై కీలక అప్డేట్ ..ఉగ్రవాది ఫ్రమ్ హైదరాబాద్..

ఆర్థిక లక్ష్యాలు

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం సుమారు 2.8 బిలియన్ డాలర్లుగా ఉండగా, రాబోయే ఐదేళ్లలో దీనిని 5 బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించారు. భారతదేశానికి అవసరమైన ఫాస్ఫేట్, పొటాష్ ఎరువుల సరఫరాలో జోర్డాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పర్యటన సందర్భంగా జోర్డాన్ యువరాజు అల్-హుస్సేన్ బిన్ అబ్దుల్లా II స్వయంగా కారు నడుపుతూ ప్రధాని మోదీని మ్యూజియానికి తీసుకెళ్లడం ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనంగా నిలిచింది. 

జోర్డాన్‌లో నివసిస్తున్న సుమారు 17,500 మంది భారతీయుల సహకారాన్ని ప్రధాని అభినందించారు. 'భారత్-జోర్డాన్ బిజినెస్ ఫోరం'లో ప్రసంగించిన ప్రధాని, భారత ఆర్థిక వృద్ధిలో భాగస్వాములు కావాలని జోర్డాన్ కంపెనీలను ఆహ్వానించారు. ముఖ్యంగా ఎరువులు, ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి (ISA), గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ వంటి భారత్ నేతృత్వంలోని సంస్థల్లో చేరేందుకు జోర్డాన్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఇథియోపియాకు బయలుదేరారు. ఈ పర్యటన ముగించుకుని ప్రధాని తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇథియోపియాకు బయలుదేరి వెళ్లారు.

Advertisment
తాజా కథనాలు