/rtv/media/media_files/2025/12/16/messi-2025-12-16-17-48-57.jpg)
Messi
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి కోలకతాకు వచ్చినప్పుడు అక్కడ ఉద్రిక్తలు చోటుచేసుకోవడం దుమారం రేపింది. ఈ ఘటనపై బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. స్టేడియంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై న్యాయబద్ధంగా దర్యాప్తు చేసేందుకు తాను రాజీనామా చేస్తున్నట్లు అరుపా బిశ్వాస్ పేర్కొన్నారు. సీఎం మమతా బెనర్జీకి తన రాజీనామా లేఖను పంపించానని ప్రకటించారు.
Also Read: కాలుష్యం కారణం శ్వాసకోశ సమస్యలు.. నివారణకు ఇంటి చిట్కాలు
విచారణ కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. దీని సూచనల మేరకు బెంగాల్ ప్రభుత్వం.. డీజీపీ రాజీవ్ కుమార్, బిధాన్‌నగర్ పోలీస్ కమిషనర్ ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హాలకు షోకాజ్ నోటీసులు పంపించింది. ఈ ఘటనలో జరిగిన లోపాలపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు బిధాన్‌నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనీష్ సర్కార్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: ఆస్ట్రేలియా ఉగ్రదాడిపై కీలక అప్డేట్ ..ఉగ్రవాది ఫ్రమ్ హైదరాబాద్..
ఇదిలాఉండగా భారత పర్యటనలో భాగంగా మెస్సీ శనివారం కోల్‌కతా స్టేడియానికి వచ్చిన విషయం తెలిసిందే. అతడు వచ్చి కొన్ని నిమిషాల్లోనే వెళ్లిపోవడంతో ప్రేక్షకులు మండిపడ్డారు. ప్లాస్టిక్ కుర్చీలను మైదానంలోకి విసిరారు. స్పాన్సర్ బ్యానర్లు అలాగే హోర్డింగ్‌లు చించివేశారు. కొందరు ప్రేక్షకులు బారికేడ్లను దాటి మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అక్కడ మొత్తం గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్, ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాను అరెస్ట్ చేయాలంటూ ప్రేక్షకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై బెంగాల్ సర్కార్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
#BREAKING | West Bengal Sports Minister tenders resignation after Messi event chaos
— NDTV (@ndtv) December 16, 2025
NDTV's @SreyashiDey reports
BJP leader Shatorupa (@shatorupa) weighs in pic.twitter.com/UowUgErJoP
Follow Us