Elon Musk: 400 బిలియన్‌ డాలర్ల క్లబ్‌ లో మస్క్‌..!

స్పేస్‌ ఎక్స్‌ ,టెస్లా అధినేత ,అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు.వ్యక్తిగత సంపాదన పరంగా తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌ లోకి చేరారు.. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు.

New Update
Elon Musk

Elon Musk: స్పేస్‌ ఎక్స్‌ ,టెస్లా అధినేత ,అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ప్రపంచ రికార్డు  సృష్టించాడు.వ్యక్తిగత సంపాదన  పరంగా తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌ లోకి చేరిపోయారు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు. స్పేస్‌ ఎక్స్‌ లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు 50 మిలియన్‌ డాలర్లు పెరిగి 439.2 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ వెల్లడించింది.

Also Read: HYD: ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్

అంతా మారిపోయింది..

2022 లో ఒకానొక సమయంలో 200 బిలియన్‌ డాలర్ల కంటే దిగువకు పడిపోయిన మస్క్‌. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఫలితాలతో అంతా మారిపోయింది. ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన మస్క్‌..ట్రంప్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ట్రంప్‌ తన కేబినెట్‌ లో  మస్క్‌ కు కీలక పదవి కూడా ఇచ్చారు.

Also Read: ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల దరఖాస్తులు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

దీంతో మస్క్‌ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ట్రంప్‌ విజయం అనంతరం టెస్లా స్టాక్స్‌ దాదాపు 65 శాతం పెరిగాయి. అంతేకాకుండా ట్రంప్‌ విజయంతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను క్రమబద్ధీకరిస్తారని మార్కెట్‌ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక టెస్లా పోటీదారులకు మేలు చేసే ఎలక్ట్రిక్‌ వాహనాలపై టాక్స్‌ క్రెడిట్‌ లను ట్రంప్‌ తొలగించవచ్చని బ్లూమ్‌ బర్గ్‌ ఇటీవల నివేదించింది.  ఈ నేపథ్యంలోనే టెస్లా స్టాక్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి. 

Also Read: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

ఇదిలా ఉంటే మస్క్‌ కు చెందిన ఆర్టిఫిషియల్‌ స్టార్టప్‌ ఎక్స్‌ ఏఐ గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో దాని విలువ రెండింతలై 50 బిలియన్‌ డాలర్లకు చేరింది.ఇక బుధవారం స్పేస్‌ ఎక్స్‌ , దాని పెట్టుబడిదారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. 1.25 బిలియన్‌ డాలర్ల విలువ గల షేర్లను స్పేస్‌ ఎక్స్‌ ఉద్యోగులు, కంపెనీ ఇన్‌ సైడర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు.

Also Read: వారెవ్వా ఏముందిరా గోల్డ్‌ క్రెడిట్ కార్డు.. 10 లక్షల మంది వెయిటింగ్‌

దీంతో స్పేస్‌ ఎక్స్‌ 350 బిలియన్‌ డాలర్ల విలువకు చేరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్‌ స్టార్టప్‌ గా స్పేస్‌ ఎక్స్‌ రికార్డు సృష్టించింది. ఇక స్పేస్‌ ఎక్స్‌ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదనే ఆధారపడింది.త్వరలో ట్రంప్‌ బాధ్యతలు తీసుకోనుండడంతో దానికి భారీగా మద్దత  లభించే అవకాశం ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు