GOOGLE: ఈ ఏడాది కూడా సౌత్ సినిమాలదే హవా..

గత కొన్నేళ్ళుగా సౌత్ సినిమాలు ఇండియన్ సినిమాను కబ్జా చేశాయి.  బాహుబలి దగ్గర నుంచీ సౌత్ సినిమాల హవా పెరిగిపోయింది. నార్త్‌లో కూడా వీటికి ఫ్యాన్స్ బాగా ఉన్నారు. దీని ఫలితమే ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్‌ మూవీస్‌గా దక్షిణాది సినిమాలు నిలిచాయి. 

New Update
11

ఇండియన్ సినిమాలో ఈ ఏడాది ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. చిన్న మూవీల దగ్గర నుంచీ బడా ప్రాజెక్టుల వరకూ  రిలీజ్ అయ్యాయి. కొన్ని పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడితే..ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చి సరికొత్త రికార్డులు సృష్టించాయి. కల్కి 2989ఏడీ, పుష్ప–2 లతో పాటూ మంజుమ్మల్ బాయ్స్ లాంటి మూవీసే అందుకు ఉదాహరణ.  కానీ ఒక్కటి మాత్రం అన్ని సినిమాల్లోనూ ఒకేలా ఉంది. అదే సోషల్ మీడియాలో హడావుడి. ఇవన్నీ మోస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే కాకుండా పెద్ద పెద్ద చర్చలకు దారితీశాయి. 

సౌత్‌ను కొట్టేవాడే లేడు..

ఈ ఏడాది తెగ వెతికేసిన సినిమాల జాబితాను గూగుల్ లో రిలీజ్ చేసింది. ఇందులో ఈ ఏడాది బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన హారర్ మూవీ స్త్రీ 2 ఫస్ట్ ప్లేసును కొట్టేసింది. ఆ తర్వాత మన డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ గురించి జనాలు తెగ సెర్చ్ చేశారుట. నెక్ట్స్ 3,4 స్థానాలను నార్త్ బెల్ట్ మూవీస్ 12th ఫెయిల్, లాపతా లేడీస్ లు దోచేశాయి.  5వ స్థానంలో మళ్లీ తెలుగు సినిమా హవా చూపింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ ఫిప్త్ బెంచ్ తీసుకుంది. ఆరు, ఏడు స్థానాలను తమిళ్, మలయాళ ఇండస్ట్రీలు పంచుకున్నాయి. మక్కల్ సెల్వన్ మహారాజాతో పాటు ఇప్పటి వరకు కేరళలోనే హయ్యెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ గూగుల్ టాప్ 10 సెర్చింగ్ సినిమాల్లో చోటు దక్కించుకుంది. 8, 9, 10 స్థానాలను కూడా సౌత్ బొమ్మలే ఆక్యుపై చేశాయి. విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, సలార్, ఫహాద్ ఫజిల్ ఆవేశాలు వరుసగా ప్లేస్‌లను ఆక్రమించుకున్నాయి. ఈ మొత్తం లిస్ట్ చూస్తే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. అదేంటంటే..ఈ ఏడాది గూగుల్‌లో సౌత్ సినిమాలే హవా నడిచింది. వీటి గురించే జనాలు ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నారు. 

Also Read: USA: మొదటిరోజే 25 ఉత్తర్వులు..ముందే ప్లాన్ చేస్తున్న ట్రంప్

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు