బీఆర్ఎస్ MLCకి కోడిపందాల కేసులో నోటీసులు

ఫామ్‌హౌస్‌లో కోళ్ల పందాలు, క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరో సారి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోని ఆయన ఇంటికి బుధవారం నోటీసులు అంటిచారు.

New Update
BRS MLC 123

BRS MLC 123 Photograph: (BRS MLC 123)

ఫామ్‌హౌస్‌లో కోళ్ల పందాలు, క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరో సారి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోని ఆయన ఇంటికి బుధవారం నోటీసులు అంటించారు.

మొయినాబాద్‌ ఫామ్​హౌస్​లో క్యాసినో, కోడి పందాల నిర్వాహణ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ క్యాసినో, కోడి పందాలు ఆడిన 61మందిపై కేసు నమోదు చేశారు. ఫామ్​​హౌస్‌ యజమాని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి 4 రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఫిబ్రవరిలో నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు ఆయన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాల కేసులో శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మళ్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Also read: Lift accident: లిఫ్ట్‌లో మరో పసి ప్రాణం బలి.. మొన్న గంగారం, నేడు సురేందర్

శ్రీనివాస్‌రెడ్డి పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును చేర్చారు. కేవలం లీజుకు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అసలు ఫామ్​హౌస్‌లో ఏం జరుగుతోందని నిఘా ఉంచాల్సిన బాధ్యత కూడా యజమానిపై ఉందని పోలీసులు చెబుతున్నారు.

Also read: Holi : హోలీ రోజున పోలీసుల ఆంక్షలు.. ఇలా చేస్తే పోలీస్ కేసు ఫైల్

Advertisment