Holi : హోలీ రోజు పోలీసుల ఆంక్షలు.. అలా చేస్తే కేసులు పెడతామంటూ వార్నింగ్

హైదరాబాద్‌లో పోలీసులు హోలీ రోజు పలు ఆంక్షలు విధించారు. రోడ్లపై వెళ్లే వారిపై రంగులు చల్లడం, గుంపులుగా చేరి ర్యాలీలు తీయడం నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

author-image
By K Mohan
New Update
holi restrictions

holi restrictions Photograph: (holi restrictions)

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. కుల, మత, ప్రాంతాలు తేడా లేకుండా హోలీని అందరూ జరుపుకుంటారు. ఈఏడాది ముస్లీంల రంజాన్ మాసంలోనే హోలీని శుక్రవారం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో మతఘర్షణలు చెలరేగకుండా హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మార్చి 14న ఉదయం 6 గంటల నుంచి 15న ఉదయం 6 గంటల వరకూ 24గంటలు ఆంక్షలు విధించారు. రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుంపులుగా రోడ్లపై ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు. అలా చేసిన వారిపై పబ్లిక్ న్యూసెన్స్ కేసులు పెడతామని చెప్పారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు హోలీ రంగులతో ఇబ్బందిపడే వారు ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడం, హోలీ పండుగ శుక్రవారం రావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోలీ రోజు రోడ్ల మీద తిరిగే వారిపై రంగులు చల్లడం కామన్.. అయితే. రంజాన్ మాసం.. పైగా శుక్రవారం కావడంతో అదే రోజున ముస్లింలు నమాజ్‌కు వెళ్లి చాలా నిష్టగా ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. మత ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకోకుండా అనుమానిత ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు