Palmyra Palm Fruit: వీరు పొరపాటున తాటిముంజులు తిన్నారో.. పైకి పోవడం గ్యారెంటీ

తాటి ముంజులు ఆరోగ్యానికి మంచిదే. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తీసుకోకూడదు. డయాబెటిస్, జీర్ణ, కాలేయ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా తినకూడదు. తింటే కొన్ని సార్లు ప్రాణలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

New Update
palmyra palm fruit

palmyra palm fruit

తాటి ముంజులు వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. దీంతో చాలా మంది వేసవిలో లిమిట్ కంటే ఎక్కువగా తీసుకుంటారు. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం వంటివి ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ కొందరు మాత్రం తాటి ముంజులను అసలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు పొరపాటున తాటి ముంజులు తినడం వల్ల కొన్నిసార్లు సమస్య తీవ్రం అవుతుందని అంటున్నారు. అయితే ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు తాటి ముంజులను తీసుకోకూడదో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

డయాబెటిస్

మధుమేహంతో ఇబ్బంది పడేవారు తాటి ముంజులను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. దీంతో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వీటిని ఎప్పుడు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

జీర్ణ సమస్యలు

కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు తాటి ముంజులును తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

గర్భిణులు

గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో ఉండే ఇథనాల్ లిపిడ్ గర్భిణులకు మంచిది కాదు. దీనివల్ల శిశువులకు కడపు నొప్పి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. 

కాలేయ సమస్యలు

కాలేయం, ఫ్యాటీ లివర్ వంటి వాటితో బాధపడుతున్న వారు తింటే సమస్యలు తప్పవు. వీటి వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

diabetic | health-issues | thati munjalu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు