Travels Bus: ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడుతున్న దృశ్యాలు వైరల్!

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్‌ మెట్రో స్టేషన్ సమీపంలోని ఉమేష్ చంద్ర స్టాచ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.

New Update
travels bus

travels bus

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌(sr-nagar) లో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఎస్ఆర్ నగర్‌ మెట్రో స్టేషన్ సమీపంలోని ఉమేష్ చంద్ర స్టాచ్ వద్ద హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(private-travels-bus) లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ట్రావెల్స్ బస్సు తగలబడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బస్సులో మంటలు 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఫైర్ యాక్సిడెంట్ కి బస్ ఫిట్ నెస్ లోపం అని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంటలు మొదలైన వెంటనే ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దింపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

Also Read :  జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్

అయితే డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. బస్సులో నుంచి పొగలు రావడం ప్రారంభమై మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ఇతర బస్ సిబ్బంది లోపల ఉన్న ప్రయాణికులను కిందకి దింపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బస్ సెల్ఫ్ మోటార్ కి బ్యాటరీకి కనెక్ట్ చేసిన వైర్లలో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడినప్పటికీ.. వారి లాగేజెస్, విలువైన ల్యాప్ టాప్స్, సెల్ ఫోన్లు మంటల్లో బూడిదైపోయాయి. 

శ్రీసాయి బాలాజీ ట్రావెల్స్ కి చెందిన బస్సు రెగ్యులర్ పికప్ ప్రకారం... ఎస్సార్ నగర్ సిగ్నల్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని బయల్దేరెందుకు సిద్దమైంది. ఇంతలోనే బస్ సెల్ఫ్ మోటర్, బ్యాటరీ కనెక్షన్స్ లో సమస్య తలెట్టడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన గురించి బస్ ఓనర్ రాము మాట్లాడుతూ.. మియాపూర్ లో బస్ ప్రారంభం కావటానికి గంటన్నర ముందు ఇంజన్ ఆన్ చేసి అన్నీ సరిగ్గానే చెక్ చేసినట్లు తెలిపారు. అప్పుడు అంతా బాగానే ఉందని అన్నారు.

దూర ప్రాంతాలకు వెళ్లే బస్ కావడంతో.. ఏసీతో సహా కండీషన్ అంతా చెక్ చేశాకే బండి రోడ్డు పైకి వస్తుందని అని చెప్పారు. అయితే ఎస్సార్ నగర్ కి రాగానే డ్రైవర్ ఫోన్ చేసి బస్ స్టార్ అవ్వడం లేదని చెప్పాడు. ఏం జరిగిందని అడిగే లోపే బస్ లో పొగలు వస్తున్నాయని చెప్పాడు. దీంతో వెంటనే ప్రయాణికులను బస్ దింపేయమని చెప్పానని తెలిపారు. నెల రోజుల క్రితమే బస్సుకు ఫిట్ నెస్ టెస్ట్ కూడా చేయించామని వివరించారు. 

Also Read :  నవమి నాటికి ఎటూ తేలకపోతే సజీవ సమాధి అవుతా.. నళిని సంచలన పోస్ట్

Advertisment
తాజా కథనాలు