Hyderabad: ఎస్ఆర్ నగర్ లో యువకుడి దారుణ హత్య
ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్ లో దారుణ హత్య కలకలం రేపింది.హనుమ హాస్టల్లో వెంకటరమణ అనే ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు ఉంటున్నాడు.అతనితో పాటు ఉండే బార్బర్ గణేష్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. దీంతో కోపం పెంచుకున్న గణేష్ కత్తితో దాడి చేసి రమణను హత్య చేశాడు.