Domakonda Nalini : నవమి నాటికి ఎటూ తేలకపోతే సజీవ సమాధి అవుతా.. నళిని సంచలన పోస్ట్

చాలా మంది అభిమానులు నా జబ్బును ట్రీట్ చేస్తామని నన్ను సంప్రదిస్తున్నారు.నాకొచ్చిన వ్యాధి,దాని కారణాల పట్ల వారికి స్పష్టత లేకపోయినా,నా మీద అభిమానంతో అలా స్పందిస్తున్నారు.వారికి ధన్యవాదాలు.

New Update
dsp

తన అనారోగ్యం, ఆర్థిక సమస్యల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు మాజీ డీఎస్పీ . తన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఇది తన మరణ వాంగ్మూలం అని కూడా ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆమె పోస్ట్ వైరల్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెంటనే స్పందించి ఆమెను పరామర్శించాల్సిందిగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావును ఆదేశించారు. తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టారు. ఆమె పోస్ట్ యధాతధంగా..  

చాలా మంది అభిమానులు నా జబ్బును ట్రీట్ చేస్తామని నన్ను సంప్రదిస్తున్నారు.నాకొచ్చిన వ్యాధి,దాని కారణాల పట్ల వారికి స్పష్టత లేకపోయినా,నా మీద అభిమానంతో అలా స్పందిస్తున్నారు.వారికి ధన్యవాదాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో అత్యంత ప్రమాదకరమైంది.ఇది రక్త మరియు ఎముకల క్యాన్సర్ తో సమానమైనది. నా లోని తెల్ల రక్తకణాలు నా అస్థి కణాలపై దాడి చేస్తూ,RA ఫ్యాక్టర్ అనే ఒక విషాన్ని స్రవిస్తాయి.ఇది రక్తంలో ప్రవహిస్తూ గుండె, లివర్,కిడ్నీలు, బ్రెయిన్ వంటి వాటిని పాడు చేస్తుంటుంది. ఫిజికల్ మరియు ఎమోషనల్ స్ట్రెస్ వల్ల ఇది వస్తుంది.అలోపతి లో దీన్ని మెయింటైన్ చేయడానికి స్టెరాయిడ్స్ వాడతారు.ఎక్కువ కాలం ఇవి వాడితే కళ్ళు చేతులు వంకర్లు పోతాయి.అందుకే నేను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదం, పంచకర్మ,యోగ,యజ్ఞం వంటి వాటిని ఎంచుకున్నాను కాబట్టే 8 ఏండ్లు అయినా శరీరంలో అంగవైకల్యం రాకుండా కాపాడుకున్నాను. అయినా నాకు ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో రావడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం . రాష్ట్రపతి మెడల్ లక్ష్యంగా డైనమిక్  ఆఫీసర్ గా పనిచేసిన నన్ను సస్పెండ్ చేయడము ,వెంటాడి వేటాడటం నా అన్ని సమస్యలకు మూల కారణం.నేటి నా దుస్థితికి cm రేవత్ రెడ్డి గారికి 21 నెలల క్రితం నేనిచ్చిన రిపోర్ట్ పై ఇంకా చర్య తీసుకోకుండా నిర్లిప్తంగా ఉండడం తక్షణ కారణం.ఇది చాలా హేయనీయం.వారికి ఫైల్ డిస్పోస్ చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదు.వారి ఇంటెన్షన్స్ ఏంటో తెలియడం లేదు. ప్రస్తుతం ఇది మరింత స్ట్రెస్ కు గురి చేస్తుంది.బహుశా ఇదే నా చావుకు దారి తీస్తుందేమో!!?
             
నిన్న  ఉదయం ఆంధ్ర, రాయలసీమ నుండి వచ్చిన ఆర్యుల సాయంతో రాజ్య సస్య యాగం చేశాను.భూమాతను మనసారా పూజించాను. సాయంత్రం 4 నుండి మళ్లీ తీవ్ర జ్వరం.చాలా క్రిటికల్ స్థితి. బతికుండగానే శరీరం కొయ్య బారిపోతుంది.ఇంచు కూడా కదలలేక పోతున్నాను.  నా చెవులతో సీఎం  స్టేట్మెంట్ వినాలి.నా ఎమోషన్స్ అర్జెంట్ గా చల్లారాలి.లేదంటే బ్రెయిన్ డెడ్ అయ్యేలా ఉంది. యజ్ఞ చికిత్స వల్ల కార్డియో మాయోపతి లక్షణాలైన  ఛాతీలో ఆయాసం,వాపు తగ్గాయి.( అందుకే నిన్న ఈ రోజు మంత్ర పాఠం,ప్రవచనం,భజన చేయగలిగాను ఆంప శయ్య పై ఉన్న భీష్మునిలా)కానీ స్ట్రెస్ , ఆంగ్జైటి, డిప్రెషన్ కంటిన్యూ అవుతున్నాయి.ఇవి నన్ను మృత్యు ముఖంలోకి నెట్టేసే స్థాయిలో ఉన్నాయి. నా డైయింగ్ డిక్లరేషన్ ను RDO తో రికార్డ్ చేపించడం మినహా సీఎం  ఇప్పటి వరకు ఇంకేమీ చేయలేదు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారికి వారం కూడా పట్టలేదు.కానీ నా విషయంలో సంవత్సరాల తరబడి కావాలని తాత్సారం చేస్తున్నారు.

Also Read :  హైదరాబాద్‌‌లో దంచికొడుతున్న వర్షం.. మరో మూడు రోజులు వానలే

6 నెలల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయాలి

ఏ ఆఫీసర్ నైనా సస్పెండ్ చేస్తే 6 నెలల్లోపు ఎంక్వైరీ పూర్తి చేయాలి.ఎంక్వైరీ సమయంలో 1/3 లేదా1/2 జీతాన్ని జీవన భృతి కింద ఇవ్వాల్సి ఉంటుంది.అలా ఇవ్వక పోవడం క్రూయల్టీ అవుతుంది.6 నెలల లోపు ఎంక్వైరీ పూరి చేయక పోతే 7 వ నెల నుండి పూర్తి జీతం ఇవ్వాల్సి ఉంటుంది.ఈ పనిని ప్రభుత్వం చేయలేదు.kcr సీఎం అయ్యాక నా విషయం పట్టించుకోలేదు.నేను వాటిని ఏదీ అడుక్కోలేదు. ఎందుకంటే వారు  అసలైన ఉద్యమకారులను ఎలా ట్రీట్ చేస్తారో నా  తెలంగాణ యాత్ర,ఢిల్లీ నిరాహార దీక్ష,పరకాల ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో అర్థం అయ్యింది.కనుకే స్వరాష్ట్రం సిద్ధించాక,నా పై ఎంతో ఒత్తిడి వచ్చినా జాబ్ అనే కొరివి దయ్యాన్ని నేను గెలక దలచుకోలేదు.మిన్నకుండి పోయాను. చనిపోయిన పాత నళిని(Domakonda Nalini) ని ఎక్యుమేషన్ చేసి బయటకు తీసి,నా ప్రశాంత జీవితం లో  మళ్ళీ తుఫాన్ సృష్టించాడు సీఎం  రేవంత్ రెడ్డి. ఒకవేళ నాకు ఏమైనా జరిగితే  మాత్రం  నేటి సీఎం గారిదే  పూర్తి బాధ్యత. నేను ఇచ్చిన రిపోర్ట్ వారి చేతిలో పెట్టినప్పుడు,దాన్ని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు, ప్రిన్సిపాల్ సెక్రెటరీ శేషాద్రి గారు చూస్తారని చెప్పారు. ఆపై 4 నెలకు osd వేముల శ్రీనివాస్ గారి చేతుల్లోకి పోయింది.ప్రస్తుతం మా బ్యాచ్ మేట్ అయిన rdo హనుమంత రావ్ గారి చేతుల్లో ఉంది.అంటే నా స్థాయిని ఎలా తగ్గిస్తున్నారో తెలుస్తుంది. సీఎంకు నా ఫైల్ డిస్పోస్ చేయడం ఇష్టం లేనట్లు తోస్తుంది.ఈ నొప్పులు తట్టుకోలేక చనిపోతే బాగుండు అనిపిస్తుంది.నవమి నాటికి నా విషయం ఎటూ తేలక పోతే నేను సజీవ సమాధి అవుతాను.నా అభిమానులు నన్ను ఆనందంతో ఈ లోకం నుండి సాగనంపవలసిందిగా కోరుతున్నాను.ఎందుకంటే ఎమోషన్స్ ను నేను ఇకపై మోయలేను .నేను ఏ రకంగా చచ్చినా అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. దీనికి నా ఫేస్బుక్ పోస్టులే సాక్ష్యం.

Also Read :  హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి తప్పుకున్న L&T

#latest Telangana updates #latest-telugu-news #telugu-news #Yadadri-Bhongir district #CM Revanth Reddy #nalgonda #Domakonda Nalini
Advertisment
తాజా కథనాలు