/rtv/media/media_files/2025/04/26/ADziOu2kg0ZWrXDpAgnQ.jpg)
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa
పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
Hyderabad Police Sent Notices To Pakistani Nationals
మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.
ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు.
Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!
మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం
Also Read : పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్
telugu-news | rtv-news | Pahalgam attack