/rtv/media/media_files/2025/04/26/9QN72mzx27vpHxIWsynB.jpg)
Bangladesh 550
భారత్,పాక్ బోర్డర్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పాకిస్తాన్ పౌరుల ఆచూకీ కనుగొనేందుకు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. పాకిస్తానీయులను గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. పాకిస్తానీయులు ఉంటే వెంటనే వెనక్కి పంపించాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలెర్ట్ చేసింది. ఈనెల 29లోపు దేశం విడిచి వెళ్లాలని అదేశాలు జారీ చేసింది. అయితే గడువు ముగుస్తుండటంతో అపరేషన్ ను స్పీడప్ చేశాయి రాష్ట్రాలు.
నకిలీ/ఫోర్జరీ డాక్యుమెంట్లతో
తాజాగా గుజారాత్ లో జరిగిన అపరేషన్ దాడుల్లో నకిలీ/ఫోర్జరీ డాక్యుమెంట్లతో భారత్ లో అక్రమంగా నివసిస్తున్నందుకు బంగ్లాదేశ్ నుండి వచ్చిన 550 మందిని అహ్మదాబాద్, సూరత్‌లలో అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత బహిష్కరణ చర్యలు చేపడతామని తెలిపారు. వారందరూ చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా భారత్ లోనే ఉన్నారని, నివాసం ఏర్పరుచుకోవడానికి నకిలీ పత్రాలను ఉపయోగించారని అధికారులు నిర్ధారించారు. దర్యాప్తు తర్వాత వారిని బంగ్లాదేశ్‌కు పంపుతామని వెల్లడించారు.
BREAKING: In a massive pre-dawn crackdown starting at 3 AM, Gujarat Police—backed by SOG, EOW, Crime Branch & HQ teams—launched one of the biggest ops to flush out illegal foreign nationals.
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 26, 2025
Over 400 illegal Bangladeshis & Pakistanis detained in a single sweep! pic.twitter.com/XMypJ2qdFn
శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్‌లో ఏకకాలంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టగా ఈ విషయాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున జరిపిన తనిఖీల్లో 400 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియన్ వెల్లడించారు. హోంమంత్రి, పోలీసు కమిషనర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అహ్మదాబాద్‌లోని క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ శరద్ సింఘాల్ తెలిపారు.