/rtv/media/media_files/2025/04/26/W20kPY75fR4zAeve537s.jpg)
Amarnath Yatra
Amarnath Yatra: కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 3న ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర 2025 నిర్వాహనపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు సమాధానం ఇస్తూ.. ఈ యాత్రను దేశ ప్రభుత్వం పూర్తి భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన గోయల్ మాట్లాడుతూ, “భారత దేశం ఎప్పటికీ ఉగ్రవాదాన్ని సహించదు, అలాగే పాక్‌తో సంబంధాలు కొనసాగించబోదు. కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు,” అని స్పష్టం చేశారు. దేశం అన్ని విషయాల్లో దృఢంగా ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం సక్రమంగా స్పందిస్తుందని అన్నారు.
అమర్నాథ్ యాత్రను ప్రశాంతంగా సాగించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను ఇప్పటికే చేపట్టినట్లు ఆయన తెలిపారు. భద్రతను పెంచేందుకు సైన్యం, కేంద్ర మంత్రివర్గ భద్రతా సంఘం (CCS) సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!
టూరిజం పునఃప్రారంభం..
'కశ్మీర్‌లో టూరిజం త్వరలోనే పునఃప్రారంభమవుతుంది. అమర్‌నాథ్ యాత్ర ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా జరుగుతుంది. దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోంది, దాన్ని వెనక్కి లాగే శక్తి ఏదీ లేదు,” అని గోయల్ స్పష్టం చేశారు.
Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్
ఈ ప్రకటనతో పహల్గాం ఘటనపై దేశ ప్రజల ఆందోళనకు కొంచెం ఊరట కలిగినట్లయింది. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, భక్తుల ప్రయాణం సురక్షితంగా సాగేందుకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నది గోయల్ అభిప్రాయపడ్డారు.