/rtv/media/media_files/2024/11/16/gvqw4eLrWDhuLQnCiDVL.jpg)
surgery
హైదరాబాద్ మెడికవర్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. చిన్నతనంలో సున్తీ చేయడం వల్ల ఓ యువకుడుకి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో అతను పూర్తిగా పురుషాంగాన్ని కోల్పోయాడు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి కోల్పోయిన పురుషాంగాన్ని పునరుద్ధరించారు. తొడ, పొట్ట ప్రాంతంలోని రక్తనాళాలు అలాగే మోచేతి నుంచి కండరాన్ని సేకరించి పురుషాంగాన్ని రూపొందించారు. దాన్నే విజయవంతంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు. అయితే ఈ శస్త్రచికిత్సను ఏడాదిన్నర క్రితం చేశారు.
ఇది కూడా చూడండి: అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన
నాలుగేళ్ల వయస్సులో సున్తీ..
ఇప్పుడు ఆ యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. అంగ స్తంభన కోసం కూడా తాజాగా పినైల్ ఇంప్లాంట్ ఏర్పాటు చేశారని వైద్యులు తెలిపారు. ఆ యువకుడికి రెండు దశల్లో చికిత్స చేయగా.. రెండూ విజయవంతమయ్యావని.. సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్‌కుమార్ తెలిపారు. శస్త్రచికిత్స చేసిన ఆ యువకుడు సోమాలియా దేశానికి చెందిన వాడు. అతనికి ప్రస్తుతం 20 ఏళ్లు ఉన్నాయి. అయితే నాలుగేళ్ల వయస్సులోనే అతనికి సున్తీ జరిగింది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు పురుషాంగాన్ని పూర్తిగా తొలగించారు.
ఇది కూడా చూడండి: Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే!
వృషణాల కింద నుంచి మూత్రం వెళ్లేలా వైద్యులు ఏర్పాటు చేశారు. అయితే 18 ఏళ్లు వచ్చినప్పుడు ఆ యువకుడు మూత్ర విసర్జనలో ఇబ్బందులు వచ్చాయి. దీంతో అతను మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిని సంప్రదించగా వైద్యులు చికిత్స చేశారు. ఫస్ట్ మూత్ర విసర్జన సరిగ్గా జరిగేలా శస్త్ర చికిత్స చేశారు. ఆ తర్వాత పురుషాంగాన్ని పునఃసృష్టించారు. ఇకపై పురుషుడు వివాహం చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. కానీ గతంలో వచ్చిన ఇన్‌ఫెక్షన్ కారణంగా వీర్య గ్రంథి పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో వీర్య ఉత్పత్తి పూర్తిగా జరగదని తెలిపారు. అయితే ఇలాంటి శస్త్రచికిత్స జరగడం ఇదే మొదటిసారి అని వైద్యులు అన్నారు.
ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?