/rtv/media/media_files/2025/03/06/upnzsQoQA9TuQ9P7Au8L.jpg)
Water Tap Photograph: (Water Tap)
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ఈ నెల 8వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని పలు చోట్లు నీటి సరఫరా ఉండదని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద నేషనల్ హైవే అథారిటీ ఓ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు జలమండలి పీఎస్సీ పైపులైన్‌ను వేరే చోటుకు మార్చనున్నారు.
ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
#Hyderabad---@HMWSSBOnline has announced a temporary water supply disruption in parts of Hyderabad on March 8, 2025.
— NewsMeter (@NewsMeter_In) March 5, 2025
The existing PSC water supply pipeline near #BHEL Junction would be shifted to another place owing to the construction of a flyover by the @NHAI_Official.
The… pic.twitter.com/3yNKRyc34D
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
12 గంటల పాటు ఈ ఏరియాల్లో వాటర్ బంద్..
దీంతో 12 గంటల పాటు నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదు. ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట, ఆర్‌సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తి శ్రీ నగర్, బీరంగూడా, అమీన్ పూర్, నిజాంపేట్‌లో 12 గంటల పాటు నీటి సరఫరా ఉండదని జలమండలి తెలిపింది.
ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!