Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ఏరియాల్లో వాటర్ బంద్
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో మార్చి 8 శనివారం రోజున నీటి సరఫరా ఉండదని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా నీటి సరఫరాకి అంతరాయం కలగించనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నీటి సరఫరా ఉండదని తెలిపారు.