Hyderabad : కక్కుర్తి పడ్డాడు.. కానిస్టేబుల్‌ను లిప్ట్ అడిగి రూ.లక్ష గుంజింది!

కిలేడీలు కొత్త ఎత్తులు వేసి మోసాలకు పాల్పడుతున్నారు.  అందంగా కనిపిస్తూ వలుపులు విసిరి హెల్ప్ కావాలంటూనే నిలువునా దోచేస్తున్నారు. అందంగా ఉంది.. పైగా ఒంటరిగా ఉందని కక్కుర్తి పడి ఎదో అనుకుని పోతే నిలువునా మోసం పోవడం తప్ప మరోకటిలేదు. 

author-image
By Krishna
New Update
hyd-ladies

హైదరాబాద్ లాంటి మహానగరంలో మోసాలకు కొదవే లేదు. తాజాగా కిలేడీలు కొత్త ఎత్తులు వేసి మోసాలకు పాల్పడుతున్నారు.  అందంగా కనిపిస్తూ వలుపులు విసిరి హెల్ప్ కావాలంటూనే నిలువునా దోచేస్తున్నారు. అందంగా ఉంది.. పైగా ఒంటరిగా ఉందని కక్కుర్తి పడి ఎదో అనుకుని పోతే నిలువునా మోసం పోవడం తప్ప మరోకటిలేదు. 

Also Read :  హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

కానిస్టేబుళ్లు, హోంగార్డులను టార్గెట్ చేసి

వరంగల్‌కు చెందిన ఓ యువతి ఏకంగా కానిస్టేబుళ్లు, హోంగార్డులను టార్గెట్ చేసి మరి మోసాలకు పాల్పడుతుంది.  ముందుగా మీ ఫోన్‌ ఇస్తే మా వాళ్లకు చేసుకుంటానని మాట కలుపుతుంది.ఆ తరువాత వారితో మాట్లాడి ఫోన్‌ తిరిగి ఇచ్చేసేది. అర్ధరాత్రి దాటాక చాటింగ్‌ చేస్తూ  నగ్న ఫొటోలు పంపిస్తూ మరుసటి రోజు కలుద్దామని కోరేది. అలా ఆశపడి వెళ్లిన వారిని డబ్బులు డిమాండ్‌ చేసేది. ఒకవేళ ఇవ్వకుంటే తనపై అత్యాచారయత్నం చేశాడంటూ  పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేది. పాపం ఎక్కడ పరుపుపోతుందో అని చాలామంది ఆ కిలేడీకి డబ్బులు సమర్పించుకున్నారు.  ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఒక కానిస్టేబుల్‌ను ఇదే తరహాలో బెదిరించి రూ.లక్ష వసూలు చేసింది. ఇలాగే మరో కానిస్టేబుల్‌నూ కూడా బోల్తా కొట్టించాలని ప్రయత్నించింది. అయితే పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలిస్తే ఈ అమ్మడు అసలు విషయం బయటపడింది. దీంతో యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Also Read :  నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?

గట్టిగా ప్రశ్నిస్తే

హైదరాబాద్ లో ఇలాంటి కేసులు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ముందుగా బైక్‌పై వెళ్లే వారిని లిఫ్ట్‌ అడిగి మాటల్లో పెడుతారు. అంతలోనే  ఫ్యాంటు జేబుల్లోని పర్సులు, సెల్‌ఫోన్లు కాజేస్తారు. ఒకవేళ  ఎవరైనా గమనించి గట్టిగా ప్రశ్నిస్తే తమ చేయి పట్టుకొని అల్లరి చేయబోయడంటూ నాన  గొడవ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతారు.  మలక్‌పేట్‌ సమీపంలో ఓ ఉద్యోగి ఇలాగే సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నాడు.  కానీ బైక్‌పై వస్తుంటే జారిపడిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో మహిళ కొట్టేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ తరహా మోసాలకు పాల్పడ్డ వీరిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపగా.. మళ్లీ విడుదల కాగానే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లుగా సమాచారం. 

Also Read :  ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 11 కోట్ల ఆటగాడు దూరం.. కట్ చేస్తే రూ.3 కోట్లు!

Also Read :  ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. మైనర్‌ను ప్రేమించి..చెల్లెలు కావాలని...

 

hyderabad | ladies | cheating | hyderabad-police | telugu-news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు