Allu Ajun-Atlee: కాపీరైట్ వివాదం..అల్లు అర్జున్, అట్లీ మూవీకి బిగ్ షాక్

అల్లు అర్జున్- అట్లీ మూవీ విడుదలకు ముందే కాపీ రైట్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే రిలీజ్ చేసిన #AA 22 పోస్టర్‌.. 2021లో విడుదలైన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ 'డూన్' టీజర్ పోస్టర్‌ పోలికలను కలిగి ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

New Update

Allu Ajun-Atlee: 'పుష్ప' తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. AA 22 వర్కింగ్ మూవీని ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్  అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే  కాపీ రైట్ వివాదంలో చిక్కుకుంది. డైరెక్టర్ అట్లీ హాలీవుడ్ మూవీ రిఫరెన్స్ తీసుకుంటున్నారా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

'డూన్'  పోస్టర్‌ కాపీ

 AA 22 పోస్టర్..  2021లో విడుదలైన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ 'డూన్' టీజర్ పోస్టర్‌ పోలికలను కలిగి ఉందంటూ ఎత్తి చూపారు నెటిజన్లు.  పోస్టర్  కలర్ పాలెట్ నుంచి బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్, విజువల్ టోన్ వరకు అన్నీ  'డూన్' పోస్టర్ పోలికలను కలిగి ఉన్నాయని అంటున్నారు. దీంతో అట్లీ  'డూన్' మూవీని కాపీ చేయబోతున్నారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.  “సీరియస్‌లీ.. 'డూన్' అట్లీ?” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా.. “నిజంగా ప్రేక్షకులు గమనించరని అనుకుంటున్నారా?” అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి అట్లీ లేదా సన్ పిక్చర్స్ సంస్థ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.  అయితే గతంలోనూ దర్శకుడు అట్లీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పలు సినిమాల విషయంలో హాలీవుడ్, కొరియన్ సినిమా ప్రేరణ పొందారని వాదనలు వచ్చాయి. 

హాలీవుడ్ రేంజ్

ఇదిలా ఉంటే మూవీ అనౌన్స్మెంట్ సందర్భంగా ఒక వీడియోను రిలీజ్ చేయగా.. కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. హాలీవుడ్ రేంజ్ ను తలపించే వీఎఫ్ ఎక్స్‌ను చూపిస్తూ అదరగొట్టేశారు. దీంతో బన్నీ బ్రాండ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. 

Also Read :   HYD NEWS: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు