Hyderabad Metro: న్యూయర్‌ వేడుకలు.. మెట్రో రైలు సేవలు పొడిగింపు

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు పొడిగించనున్నారు. డిసెంబర్ 31న మంగళవారం అర్థరాత్రి 12.30 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో ట్రైన్ బయలుదేరుతుంది. జనవరి 1న 1.15 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.

New Update
Hyderabad metro Timings

Hyderabad metro Timings

ప్రపంచ దేశాలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 31 రాత్రికి న్యూ ఇయర్ వేడుకలు చేసుకునేందుకు అందరూ ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో రైలు కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 31న మంగళవారం అర్థరాత్రి 12.30 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో ట్రైన్ బయలుదేరుతుందని చెప్పింది. అలాగే జనవరి 1న 1.15 AM గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని పేర్కొంది.  

Also Read: మందు బాబులకు న్యూఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా ఇంటికి వెళ్లొచ్చు.. 500 కార్లు రెడీ!

న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు రవాణా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా వెళ్లాలని కోరుకుంటున్నామని ఎల్‌ అండ్ టీ మెట్రో ఎక్స్‌ వేదికగా తెలిపింది. ఈ ఉద్దేశంతోనే మెట్రో ట్రైన్ సేవలు పొడిగించినట్లు పేర్కొంది. 

Also Read: మావోయిస్టు లచ్చన్న టీం వాష్ అవుట్.. RTVతో ఎస్పీ రోహిత్‌రాజ్!

Also Read: నాకూ తగ్గించాలనే ఉంది..పన్ను మినహాయింపుపై నిర్మలా సీతారామన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు