31st అని తాగినా.. ఒక్కరోజు వదిలేయండి సార్ ప్లీజ్ | Drunk And Drive In Hyderabad | New Year | RTV
న్యూజిలాండ్‌లో తొలి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. 2025 సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ ఆక్లాండ్ వాసులు న్యూఇయర్ వేడుకల్ని ప్రారంభించారు. బాణాసంచా పేల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. అమెరికన్ సమోవా, బేకర్ ద్వీపాలు చివరిగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి.
నాగ చైతన్య- శోభిత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను విదేశాలలో కాకుండా ముంబైలో సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. ముందుగా విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ముంబైలోనే సెలెబ్రేషన్స్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలు పొడిగించనున్నారు. డిసెంబర్ 31న మంగళవారం అర్థరాత్రి 12.30 గంటలకు అన్ని టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో ట్రైన్ బయలుదేరుతుంది. జనవరి 1న 1.15 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలతో సహా 1239 మంది పై కేసులు నమోదు చేశారు.
అల్లూరి జిల్లా అరకులోయ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముస్తాబయింది. హోటళ్లు, లాడ్జిలు, దేవాలయాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. పర్యాటక ప్రదేశాలు జనంతో కిటికిటలాడుతున్నాయి. ఎక్కడికక్కడ ఫైర్ క్యాంపు లతో ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు.