ఆదాయపు పన్నులో ఉపశమనం కోసం దేశంలో మధ్య తరగతి నుండి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంది. ప్రతీ ఏడాది బడ్జెట్‌లో పన్ను మినహాయింపు కోసం వీరు ఎదురు చూస్తూనే ఉంటారు. గత ఏడాది కూడా ప్రజలు పన్ను శ్లాబులను మార్చాలని ఆర్థిక మంత్రిని కోరారు. అయితే ఈసారి అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పన్ను నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలకు పెద్ద పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నారు. వార్షికాదాయం రూ.15 లక్షల వరకు ఉన్న వారికి ఈ ఉపశమనం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. Also Read: తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలకు చంద్రబాబు శుభవార్త! పన్ను మినహాయింపుతో పాటూ విద్య, గృహాలు.. ఈ నేపథ్యంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలను పంచుకున్నారు. మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించే అంశాన్ని నేను గౌరవిస్తాను. నేను మరింత చేయాలనుకుంటున్నాను, కానీ పన్నుల విషయంలో పరిమితులు ఉన్నాయి. ఇప్పటికే జీతభత్యాల కోసం, స్టాండర్డ్ డిడక్షన్ ₹50,000 నుండి ₹75,000కి పెంచామని సీతారామన్ టైమ్స్ నౌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీని వలన చాలామంది మధ్య తరగతి, ఎగువ తరగతి వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. అయితే రాయిటర్స్ నివేదించినట్టు వచ్చే ఏడాది బడ్జెట్‌లో పన్ను శాతం మరింత తగ్గించే అవకాశం ఉన్నట్టుగా చెప్పినా...ఎంత వరకు ఉంటుంది అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. పన్ను సంస్కరణలు ఉంటాయని...వాటితో పాటూ విద్య, గృహాలపైన సబ్సీడీ ఇచ్చే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందిస్తామని తెలిపారు. ఈ ఏడాది జూలై తర్వాత భారత ఆర్ధిక అభివృద్ధి బాగా పడిపోయిందని...అది మళ్ళీ తిరిగి పుంజుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. రాబోయే బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారుల ఆందోళనలను పరిష్కరించడం, వినియోగాన్ని పెంచడం, ఆర్థిక సవాళ్లను నావిగేట్ చేయడం లాంటి వాటి మీద దృష్టి పెడతామని అన్నారు. Also Read: TS: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ