Maoist: మావోయిస్టు లచ్చన్న టీం వాష్ అవుట్.. RTVతో ఎస్పీ రోహిత్‌రాజ్!

మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై ఫుల్ ఫోకస్ పెట్టామని భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ చెప్పారు. ఇటీవల లచ్చన్న టీంను పూర్తిగా వాష్ అవుట్ చేశామన్నారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. 

author-image
By srinivas
New Update
 SP Rohitraj

SP Rohitraj

Maoist: తీవ్రవాదంపైనే ఫుల్ ఫోకస్ పెట్టామని భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు. మావోయిస్టు తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో పటిష్టభద్రతా ఏర్పాటు చేశామన్నారు. మావోల కార్యాకలాపాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం RTVతో మాట్లాడిన రోహిత్ రాజ్.. ఇటీవల ఎక్స్ఛేంఛ్ ఆఫ్ ఫైర్‌లో పాల్వంచ - మణుగూరు ఏరియా కమిటీ లచ్చన్న టీంను పూర్తిగా వాష్ అవుట్ చేశామన్నారు. ఇందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసులకోసం ప్రత్యేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 

పూర్తి సహకారం అందేలా చూస్తాం..

ఇక మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నామన్నారు. జనజీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు పోలీసు విభాగం అలర్ట్ గా పనిచేస్తుందన్నారు. రాష్ట్రవాప్తంగా గంజాయి రవాణాను నియంత్రించడంలో చురుగ్గా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక సమాజంలో అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కొంతమంది నిందితులపై కేసులు నమోదు చేశామని, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోలీసుల పనితీరు సంతృప్తినియంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Metro romance: హైదరాబాద్ మెట్రోలో రాసలీలలు.. అడ్డంగా బుక్కైన జంట!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు