Madhapur Fake Call Center: మాదాపూర్‌లో ఫేక్ కాల్ సెంటర్ స్కామ్.. 65 మంది అరెస్ట్!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఫేక్ కాల్ సెంటర్ స్కామ్ బట్టబయలైంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల్ని టార్గెట్ చేసి డబ్బులు దోచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారని గుర్తించారు.

New Update
Hyderabad Madhapur Fake call center scam 65 people arrested

Hyderabad Madhapur Fake call center scam 65 people arrested

హైదరాబాద్‌లో భారీ మోసం బట్టబయలైంది. అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించి వాటిని క్రిఫ్టో కరెన్సీగా మార్చుతూ కోట్లకు పరుగులు పెట్టిన ఓ కేటుగాళ్ల ముఠాను పోలీసులు తాజాగా పట్టుకున్నారు. ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు రీసెంట్‌గా దాడులు నిర్వహించగా ఓ నకిలీ సంస్థ వ్యవహారం బయటకొచ్చింది. అనేక అక్రమ లావాదేవీలు, చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు దాదాపు 65 మందిని అరెస్టు చేశారు. అందులో ఎగ్జిటో సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చందా మనస్విని కూడా ఉన్నారు. 

Also Read: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కెప్టెన్.. మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ

టెలికాలర్లుగా ఫేక్ కాల్స్

కాగా వీరు టెలికాలర్లుగా ఫేక్ కాల్స్ చేస్తూ అమెరికాలో ఉంటున్న భారతీయుత్ని టార్గెట్‌గా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఒక రహస్య సమాచారం ఆధారంగా.. టిజి సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్‌బి) సిబ్బంది బుధవారం రాత్రి మధాపూర్‌లోని ఒక భవనంలో ఉన్న కాల్ సెంటర్‌లో దాడులు నిర్వహించారు. అది నకిలీ కాల్ సెంటర్‌గా పోలీసులు గుర్తించారు. చట్టబద్ధమైన వ్యాపారం ముసుగులో నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్‌ అని తెలిపారు. 

Also Read: మనుషులా మానవ మృగాళ్ల.. మహిళను హత్య చేసి, పాదాలకు మేకులు కొట్టి - చేతిపై సూదితో పొడిచి!

ఈ మోసపూరిత ఆపరేషన్‌తో ప్రతి రోజూ అమెరికాలో ఉంటున్న వందలాది మంది భారతీయుల్ని వీరు మోసం చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ విషయంపై టిజిసిఎస్‌బి డైరెక్టర్ శిఖా గోయెల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ మోసపూరిత చర్యలకు పాల్పడిన ముఠాను పట్టుకున్నామని తెలిపారు. దాదాపు 65 మందిని అదుపులోకి తీసుకున్నామని.. వారిని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు. వీరు ఎన్‌ఆర్‌ఐలు, యుఎస్ పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు, మోసపూరిత సంస్థలో పనిచేస్తున్నట్లు కనుగొన్నామని తెలిపారు. 

కాగా మాదాపూర్‌లో నిర్వహిస్తున్న ఈ కాల్ సెంటర్‌ వెనుక ప్రధాన నిందితుడు గుజరాత్ నివాసి కైవన్ పటేల్, రూపేష్ కుమార్ ఉన్నట్లు తెలిపారు. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇదిలా ఉంటే ఎగ్జిటో సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చందా మనస్వి ఎగ్జిటో సొల్యూషన్స్ కంపెనీని స్థాపించి.. ఈశాన్య రాష్ట్రాల నుంచి 40 మందితో పాటు 63 మంది ఉద్యోగులను నియమించుకుంది. వారికి  నెలకి రూ.30వేలు జీతం చెల్లించి ఉద్యోగంలో పెట్టుకుంది.

Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!

అప్పటి నుంచి వీరంతా పేపాల్ కస్టమర్ కేర్ ప్రతినిధులుగా బాధితులకు పరిచయం అయ్యి.. అమెరికా పౌరులకు అనధికార ట్రాన్సక్షన్‌ల గురించి ఫేక్ ఇన్ఫర్మేషన్ అందించే టెలీ కాలర్లుగా వర్క్ చేస్తున్నారు. ఈ పని కోసం వీరు EYEBEAM, X-LITE వంటి అధునాతన సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించినట్లు తెలిసింది. ఇక ప్లాన్ ప్రకారమే.. బాధితుడి ఖాతాలో అనధికార ట్రాన్సక్షన్స్ జరిగాయని మోసగించి వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని డబ్బులు కాజేశారు. 

ముందుగా కేటుగాల్లు.. బాధితుడి అకౌంట్లో అనధికర ట్రాన్సక్షన్స్ జరిగినట్లు ప్రకటిస్తూ ఒక ఇమెయిల్ పంపాడు. అదే ఇమెయిల్‌లో PayPal కస్టమర్ కేర్ కాంటాక్ట్ రిఫరెన్స్‌గా పేర్కొంటూ ఒక నంబర్‌ను పంచుకున్నాడు. ఇక బాధితులు తాము ఎటువంటి లావాదేవీలు చేయలేదని తెలియజేయడానికి ఇమెయిల్‌కు స్పందించారు. ఆ తర్వాత వారు భయపడి కస్టమర్లు ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌లు బాధితులతో మాట్లాడి వారి నుంచి అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఓటీపీ ద్వారా బాధితుల నుండి డబ్బును స్వాహా చేశారు అని పోలసులు వెల్లడించారు. అలా దోచేసిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి డిజిటల్ వాలెట్లకు పంపించుకున్నట్లు తెలిపారు. 

ఇలా ప్రతి కాలర్ రోజుకు కనీసం 10 మందిని మోసం చేయాలనే వారు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు.. దీని ద్వారా రోజుకు 600 మందిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా కేటుగాళ్ల ముఠాను పట్టుకుని వారినుంచి 52 ల్యాప్ టాప్‌లు, 63 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు