/rtv/media/media_files/2025/05/22/LlpPlgosFX39XYi1CRrz.jpg)
gold jewelry
HYD Crime: హైదరాబాద్‌లో భారీ గోల్డ్ కుంభకోణం బయటపడింది. ఈ ఘటనలో ఉద్యోగులే దొంగలయ్యారు. ఏకంగా రూ.2 కోట్ల విలువ చేసే బంగారు రుణాలు మంజూరు చేశారు. సరైన పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చిన ఇద్దరు ఎస్‌బీఐ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వడ్డీతో కలిసి సుమారు రూ.2.2 కోట్ల వరకు మేరకు మోసానికి పాల్పడినట్లు పోలీసులు విచారణాలో తేలింది. ఈ దారుణం హైదరాబాద్‌లోని రాంనగర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. మేనేజర్ డి.సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేయటంలో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు ఉద్యోగులతోపాటు మరో 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
బ్యాంకు మార్గదర్శకాలను పట్టించుకోకుండా ..
ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఎస్‌బీఐలో సర్వీస్ మేనేజర్‌గా పని చేస్తున్న గుగ్లోత్ జైరాం నాయక్, క్యాష్ ఇన్‌ఛార్జ్ చీర్లా రుతు పవన్‌తో కలిసి ఈ కుంభ కోణం చేశారు. బంధువులు, కుటుంబ సభ్యులు, సహచరుల పేరిట సరైన పూచీకత్తు లేకుండా నకిలీ బంగారు రుణాలను మంజూరు చేశారు. అయితే ఈ ఇద్దరితోపాటు మరో 18 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు విచారణతో తేలింది.. ప్రధాన నిందితుడు నాయక్‌గా గుర్తించారు. ఈ కుంభ కోణాన్ని బయటపేట్టిన బ్రాంచి మేనేజర్ సునిల్ మే 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుగ్లోత్ జైరాం నాయక్ చెల్లుబాటయ్యే పూచీకత్తు లేకుండా, బ్యాంకు విధానాలను ఉల్లంఘించి ఈ రుణాలను ప్రాసెస్ చేశాడు. క్యాష్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జిగా ఉన్నా బ్యాంకు మార్గదర్శకాలను పట్టించుకోకుండా దుర్వినియోగం చేశాడు.
ఇది కూడా చదవండి: బరువు తగ్గించే గింజలు.. వీటితో మాముల ప్రయోజనాలు కాదు.. తప్పక తెలుసుకోండి!
ఈ మోసంతో రూ.2.2 కోట్లను అక్రమంగా పోగు చేశాడు. ఈ నిధులను వివిధ వ్యక్తిగత ఖాతాలకు, ఎల్లారెడ్డిగూడలోని ఓ ప్రైవేటు సంస్థకు నిధులు మళ్లించారని మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వడ్డీతో సహా రూ.2.2 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు లిఖితపూర్వక వాంగ్మూలంలో నాయక్ అంగీకరించారు. ఈ ఫిర్యాదుపై సీసీఎస్ (హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్)లో నిందితులపై సెక్షన్ 316(5), 318(4) కింద కేసు నమోదు చేశారు. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఈ మోసం తాజాగా జరిగిన ఆడిట్‌లో వెలుగులోకి రావటం గమనార్హం. ప్రధాన నిందితుడు నాయక్, రుతు పవన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల పాత్రను సీసీఎస్ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: చెర్రీ టమోటాల గురించి విన్నారా? ఈ 5 అద్భుతమైన ప్రయోజనాల తప్పక తెలుసుకోండి!
( ts-crime | ts-crime-news | crime | latest-news | telugu-news | sbi | gold)