BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు!

హైదరాబాద్‌లో పెళ్లైన 7రోజులకే నవ వధువు మౌనికను బీజేపీ నేత గురజాల అరవింద్‌ ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పెళ్లైన అరవింద్ పై కాలనీ వాసులు మండిపడుతూ అతని చిత్రపటానికి చెప్పుల దండేసి నిరసన తెలిపారు. మౌనిక మాత్రం ఇష్టపూర్వకంగానే వెళ్లానంటోంది.

New Update

BJP Leader love case: హైదరాబాద్‌లో నవ వధువు మిస్సింగ్‌ కేసు కలకలం రేపుతోంది. పెళ్లయిన 7 రోజులకే నవ వధువు మౌనికను గోల్కొండకు చెందిన బీజేపీ నేత గురజాల అరవింద్‌ ఎత్తుకెళ్లడం రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతోంది. అత్తాపూర్‌కు చెందిన శివరామకృష్ణతో ఇష్టం లేకపోయినా తలవంచి‌ తాళి కట్టించుకున్న మౌనిక.. మూడు రోజుల కిందట తన ప్రియుడు అరవింద్‌తో కలిసి లేచిపోయింది. దీంతో మౌనిక కుటుంబసభ్యులు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్‌ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి

చిత్రపటానికి చెప్పుల దండ..

దీంతో కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అరవింద్‌కు ఇదివరకే పెళ్లి అయిందని, ఒక పాప కూడా ఉందని వెల్లడించారు. అయితే మౌనికతో ఎఫైర్ పెట్టుకున్న బీజేపీ నేత అరవింద్ నిర్వాకంపై కాలనీ వాసులు మండిపడుతున్నారు. అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. కానీ మౌనిక మాత్రం తను ఇష్టపూర్వకంగానే అరవింద్‌తో వెళ్లానని, అతనితోనే ఉంటానని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. 

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురజాల అరవింద్(46) లంగర్ హౌస్ గొల్లబస్తీలో ఉండే యువతితో కొన్నేండ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు.  అయితే మూడు రోజుల కింద బండ్లగూడ సమీపంలోని ఆర మైసమ్మ ఆలయం వద్దకు ఆమెను రమ్మని తీసుకుని పారిపోయాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు