GHMC: హైదరాబాద్‌లో మంచినీటి కష్టాలు.. 3 రోజులుగా అల్లాడిపోతున్న జనం!

మూడు రోజులుగా మంచినీరు లేక హైదరాబాద్ ప్రజలు అల్లాడిపోతున్నారు. BHEL జంక్షన్ దగ్గర PSC పైప్ లైన్ రిపేర్ కారణంగా పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిచిపోయింది. దీంతో తాగునీరు లేక అష్టకష్టాలు పడుతున్న జనాలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
wtr

Hyderabad BHEL drinking water supply issue

Hyderabad: హైదరాబాద్‌లో మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. BHEL జంక్షన్ దగ్గర PSC పైప్ లైన్ రిపేర్ కారణంగా పలు ప్రాంతాల్లో 3 రోజులుగా వాటర్ సప్లై నిలిచిపోయింది. 12గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని NHAI అధికారులు చెప్పారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం 6 నుంచి సాయంత్ర 6 గంటల వరకు వాటర్ సప్లై నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 

30 గంటలు దాటినా సప్లై లేదు..

కానీ 30 గంటలు దాటినా పైప్ లైన్ పనులు పూర్తి కాలేదు. దీంతో తాగునీరు లేక అష్టకష్టాలు పడుతున్న జనాలు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. దీంతో రంగంలోకి దిగిన జలమండలి NHAIపై ఫైర్ అయింది. పైప్ లైన్ రిపేర్ ఎందుకింత ఆలస్యం చేస్తున్నారంటూ ఆరాతీసింది.

Also Read:  UP: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

ఈ మేరకు అమీర్ పేట్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తి శ్రీ నగర్, బీరంగూడ, అమీన్ పూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో మంచినీరు లేక జనం అవస్తలు పడుతున్నారు. NHAI అధికారుల నిర్లక్ష్యంగానే నీరు రావట్లేదని, ఇప్పటికైన వేగంగా పనులు జరిపి నీటి సరాఫరా చేయాలని కోరుతున్నారు. 

Also Read: Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!

అయితే కొన్ని చోట్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని HMWSB తెలిపింది. మరికొన్ని చోట్ల తక్కువ నీటి సరఫరా జరుగుతుందని, ప్రభావిత ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు