TG Advocates: భద్రతా వైఫల్యం వల్లే దాడి.. జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఇష్యూలో అడ్వకేట్స్ కీలక నిర్ణయం!

రంగారెడ్డి జిల్లా కోర్టు మహిళా జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఘటనను న్యాయమూర్తుల సంఘం ఖండిస్తోంది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమకు కోర్టులో మరింత రక్షణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. 

New Update
advocate

Hyderabad Advocates association condemns attack on judge

TG Advocates: మహిళా జడ్జిపై ఖైదీ చెప్పు విసిరిన ఘటనను తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, తమకు కోర్టులో మరింత రక్షణ కావాలని న్యాయమూర్తుల సంఘం డిమాండ్ చేసింది. అంతేకాదు ఇది న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు, ఆదిలాబాద్‌ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి కె.ప్రభాకర్‌రావు,  సంఘం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు జిల్లా అదనపు జడ్జి కె.మురళీమోహన్‌ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన రిలీజ్ చేశారు.

Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?

హత్య కేసులో జీవిత ఖైదు వేసినందుకు..

రంగారెడ్డి జిల్లా కోర్టు హాల్‌లో మహిళా జడ్జిపై ఖైదీ దాడిని ఖండిస్తున్నాం. కేసు విచారణ జరుగుతుండగా చెప్పు విసరడం దారుణం. ఈ ఘటనతోనైనా కోర్టుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న కరణ్‌సింగ్‌ అలియాస్‌ సర్దార్‌ చీమకొర్తి(22) 2023 జనవరి 5న ఒకరిని హత్య చేశాడు. జగద్గిరిగుట్టలో మరుసటి రోజు అరెస్టు చేసేందుకు వెళ్లిన ఎస్‌వోటీ పోలీసులపై తల్వార్‌తో దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులపై హత్యాయత్నం కేసులో మహిళా జడ్జి కరణ్‌సింగ్‌కు జీవితఖైదు విధించారు. దీంతో జైలులో ఇబ్బందులను చెప్పుకొంటానని జడ్జిని సర్దార్ కోరాడు. ఆమె అంగీకరించడంతో తన చెప్పును జడ్జిపైకి విసిరాడు. ఆమె కుటుంబం అంతుచూస్తానని బెదిరించాడు. 

ఇది కూడా చదవండి: CM Revanth: మోదీ బీసీ కాదు.. కేసీఆర్‌కు తెలంగాణలో ఉండే హక్కు లేదు: రేవంత్ సంచలనం!

ఈ ఘటనతో అందరూ ఉలిక్కిపడగా అప్రమత్తమైన పోలీసులు సర్దార్ ను గదిలోకి తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న న్యాయవాదులు కరణ్‌సింగ్‌ను పొట్టు పొట్టు కొట్టారు. కరణ్‌సింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. మహిళా జడ్జి ఫిర్యాదు మేరకు సర్దార్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చదవండి: AP Crime: ఆమెకు ఓ భర్త, ఇద్దరు ప్రియులు.. ముగ్గురిలో ఒకరు మర్డర్.. చివరికి మరో బిగ్ ట్విస్ట్!

Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు