/rtv/media/media_files/2025/08/03/cyber-crime-2025-08-03-10-59-37.jpg)
CYBER CRIME
తాజాగా సైబర్ నేరస్థుల నయా మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి వేసిన వలలో సైబర్ నేరగాళ్లు సక్సెస్ అయ్యారు. లాభాలొచ్చినట్లు బాధితుడ్ని నమ్మించి ఆఖరికి ముఖం చాటేశారు. ఈ క్రమంలోనే బాధితుడి నుంచి రూ.3 కోట్లు కొట్టేశారు. అయ్యో ఇదంతా పోలీసులకు చెబితే తనకు ఏమైనా అవుతుందేమోనని భయపడి పోలీసులకు చెప్పకుండా ఉండిపోయాడు. కానీ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారాన్ని బయటపెట్టడంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : అతనొక లిల్లీపుట్.. జగదీష్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు
HYD CYBER CRIME
ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. అనేక రకాల మోసాలతో ప్రజలను బురిడీ కొట్టించి కోట్లలో డబ్బులు గుంజేస్తున్నారు. నకిలీ కంపెనీల పేరుతో, అద్భుతమైన ఉద్యోగాలు ఇస్తామంటూ, ట్రేడింగ్ లో డబ్బులు పెడితే భారీగా డబ్బులు వస్తాయంటూ నమ్మించి దోచేస్తున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులనే టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ తరచూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (43) మణికొండ ల్యాంకోహిల్స్ రోడ్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో అతడి వాట్సాప్‌కు ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ పేరుతో మెసేజ్ వచ్చింది. ఆ కంపెనీలో డబ్బులు పెట్టుబడిగా పెడితే ఊహించని లాభాలు వస్తాయని మెసేజ్‌లో ఉంది. దీంతో ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఆశ కలిగింది.
అనంతరం ఆ మెసేజ్ ఓపెన్ చేసి ఇవ్వాల్సిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చాడు. అదే క్రమంలో సైబర్ కేటుగాళ్లు అందులో చూపించిన బ్యాంక్ అకౌంట్‌కు ఏప్రిల్ 12 నుంచి 23 వరకు సుమారు రూ.2 కోట్ల వరకు ట్రాన్సఫర్ చేశాడు. అయితే ఆ తర్వాత అతడికి కాస్త అనుమానం వచ్చింది. దీంతో సైబర్ నేరస్థులను అడిగాడు. వెంటనే వారు నమ్మకం లేకపోతే మీ డబ్బును మీరు వెనక్కి తీసుకోండి అని కేటుగాళ్లు చెప్పారు.
దానికి అంగీకరించిన ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. తన తల్లి బ్యాంక్ అకౌంట్‌ను వారికి ఇచ్చి.. షేర్ల సొమ్మును ఆ అకౌంట్‌కు ట్రాన్సఫర్ చేయాలని సూచించాడు. దీంతో వారు వెంటనే రూ.87 లక్షల వరకు బాధితుడి తల్లి అకౌంట్‌కు ట్రాన్సఫర్ చేశారు. అప్పుడు ఇదంతా నిజమేనని నిర్ధారించుకున్న బాధితుడు.. నమ్మకం పెరిగి మళ్లీ అదే కంపెనీలో పెట్టుబడులు పెట్టుకుంటూ పోయాడు. అలా సుమారు రూ.3.92 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాడు.
అయితే మధ్యలో మరోసారి షేర్ల సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్రించగా.. సైబర్ కేటుగాల్లు మొహం చాటేశారు. దీంతో తాను మోసపోయానని భావించిన కేటుగాడు.. జరిగిన విషయాన్ని పోలీసులకు చెబితే తనకు ఏమైనా జరుగుతుందేమోనని.. ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాడు. అయితే ఇటీవలే గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడి తల్లి ఖాతాను నిలిపివేశారు. సైబర్ నేరాలతో ముడిపడి ఉన్న రూ.87 లక్షలు ఆ అకౌంట్‌కు ట్రాన్సఫర్ జరిగిందని.. అందువల్లే అకౌంట్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ బాధితుడు చేసేదేమి లేక ఈ నెల 1వ తేదీన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కంప్లైంట్ ఇచ్చాడు.
Also Read : తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా
Cyber Crime Fraud | cyber crime cases | latest-telugu-news | latest telangana news | telugu crime news