తెలంగాణ జాగృత నాయకురాలు కవిత సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆమె ఆగ్రహాన్ని బయటపెట్టారు. తన మీద వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్‌లోని పెద్ద నాయకుడి కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
మరోవైపు.. నల్లగొండలోని ఓ బీఆర్ఎస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండలో ఆయన ఒక్కడు గెలిచి మిగిలిన సీట్ల ఓటమికి కారణమయ్యాడని మండిపడ్డారు. అలాంటి లిల్లీపుట్ నేత కూడా నా మీద మాట్లాడుతన్నాడని సీరియస్ అయ్యారు. అసలు కేసీఆర్ లేకపోతే ఆ లిల్లీపుట్ లీడర్ ఎవరు? అని ప్రశ్నించారు.
ఇటీవల ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కవితపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌లో కవిత పరిస్థితి ఏంటని అడిగిన ప్రశ్నకు జగదీష్ రెడ్డి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. కవిత గురించి మాట్లాడటానికి ఏం లేదు. ఆమె గురించి మాట్లాడటం టేమ్ వేస్ట్. ఆమె గురించి పార్టీలో పెద్దగా ఎవరూ మాట్లాడుకోరు. ముఖ్యంగా ఆమె పార్టీకి చెందిన వ్యక్తిగా ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే, కానీ పార్టీ దాటి బయటకు వెళ్తే ఏ విలువ ఉండదు అని జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు ఆయన గురించే అని నెట్టింట చర్చ జరుగుతోంది.
నల్లగొండలో ఓ లిల్లీపుట్ మాత్రమే గెలిచి.. జిల్లాలో ఇతర బీఆర్ఎస్ నేతలను ఓడించారని ఆమె అన్నారు. పరోక్షంగా ఆమె ఆ వ్యాఖ్యలు మాజీమంత్రి జగదీశ్ రెడ్డి గురించి అన్నట్లు తెలుస్తోంది. పార్టీలో మరో వ్యక్తి కవిత వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల పార్టీలో చేరిన చిన్న పోరడివి.. చిన్నోడిలా ఉండాలని చెప్పారు.
BRAKING: అతనొక లిల్లీపుట్.. జగదీష్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు
కవిత సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డపై ఆరోపణలు వస్తే.. బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆమె ఆగ్రహాన్ని బయటపెట్టారు. నాపై బీఆర్ఎస్‌లోని ఓ పెద్ద నాయకుడి కుట్ర అంటూ పరోక్షంగా కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు.