Mee seva: రేషన్‌కార్టుల దరఖాస్తుల కోసం మీసేవా కేంద్రాల్లో రద్దీ.. అధికారులు కీలక ప్రకటన

మీసేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు భారీగా తరలివస్తున్నారు. ప్రజాపాలన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

New Update
Mee seva

Mee seva

తెలంగాణ ప్రభుత్వ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో మీ సేవా కేంద్రాల్లోకి దరఖాస్తులు చేసుకునేవారు భారీగా తరలివస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరించాలని మీసేవ అధికారులను ఇప్పటికే పౌర సరఫరాలశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం నుంచి మీసేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 

Also Read: ట్రైన్లో ఆ పనులు ఏంట్రా నాయనా.. బాత్రూంలో అలా అడ్డంగా దొరికిపోయిన జంట!

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న మీ సేవ కేంద్రానికి మంగళవారం ఉదయం నుంచే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకునేందుకు భారీగా వచ్చారు. వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్యూలైన్‌ను ఏర్పాటు చేశారు. దరఖాస్తు స్వీకరణలకు సోమవారం రాత్రి వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చినట్లు నిర్వాహకులు చెప్పారు. 

Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!

ఇదిలాఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన కొత్త ప్రజాపాలన కింద అప్లికేషన్లు సేకరించిన సంగతి తెలిసిందే. ఇటీవల కులగణన కూడా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రజాపాలన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని.. కాబట్టి వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతేకాదు ఒక రేషన్ కార్డు దరఖాస్తుకు కేవలం రూ.50 మాత్రమే మీసేవా నిర్వహకులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఎక్కువ అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది. 

Also Read: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

Also Read: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు