PM Modi: పారిస్ ఏఐ సమ్మిట్‌.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ

పారిస్ వేదికగా జరుగుతున్న ఏఐ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే వందతులు ఉన్నాయన్నారు. ఏఐ వల్ల మనం చేసే పనుల్లో మార్పులు వస్తాయని, స్కిల్స్‌ పెంచుకున్నవారికి అవకాశాలు ఉంటాయన్నారు.

New Update
PM Modi

PM Modi

ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) యాక్షన్ కమిటీ సదస్సుకు సహా అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన వివిధ దేశాధినేతలు, టెక్‌ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. '' ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం చేసే పనుల్లో మార్పులు వస్తాయి. టెక్నాలజీ మానవులకు వినియోగకరంగా ఉండాలంటే అది స్థానికంగా నెలకొన్న వ్యవస్థల్లోకి వెళ్లిపోవాలి.  

Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!

140 కోట్ల మంది ప్రజల కోసం భారత్‌ అందుబాటు ధరలోనే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సక్సె్స్‌ఫుల్‌గా నిర్మించింది. ప్రస్తుతం ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే వందతులు ఉన్నాయి. చరిత్రను చూసుకుంటే పని అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ అది మనం చేసే పద్ధితిలో కాలానుగుణంగా మారుతూ వస్తుంది. అలాగే కొత్త ఉద్యోగాలు సైతం సృష్టించబడతాయి. ఉద్యోగాల్లో తమ స్కిల్స్‌ను పెంచుకునేవారికే ఈ అవకాశాలు దక్కుతాయి. భారత్.. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా ముందుకెళ్తోంది.  

సుపరిపాలన అంటే కేవంల ప్రత్యర్థులను ఎదుర్కోవడం కాదు ఆవిష్కరణలను సైతం ప్రోత్సహించాలి. సైబర్ సెక్యూరిటీ, డీఫ్‌ఫేక్ లాంటి తప్పుడు వాటి సమస్యలు పరిష్కరించాలి. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం వంటి రంగాలను మెరుగుపరిస్తే కోట్లాదిమంది ప్రజల జీవితాలను మార్చడంలో ఏఐ ఎంతగానో సాయపడుతుంది.ఇది జరగాలంటే వనరులు, ప్రతిభ ఉన్న సమాజం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే గ్లోబల్ సౌత్ దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేనటువంటి ఏఐ అందుబాటులో ఉండాలని'' ప్రధాని మోదీ అన్నారు. 

Also Read: ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. ట్రంప్ సంచలన ప్రకటన

ఇదిలాఉండగా ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లడం ఇది ఆరోసారి. ఇక 12వ తేదీ సాయంత్రం ఆయన అమెరికాకు చేరుకోనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ప్రధాని మోదీ ఆయన్ని కలవనుండటం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాధినేతలు వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. పలు దేశాలపై అమెరికా టారిఫ్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రదాని మోదీ అమెరికా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాళ్లిద్దరూ ఏ ఏ అంశాలపై చర్చించుకుంటారో అనేది ఆసక్తిగా మారింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు