/rtv/media/media_files/2025/07/15/telangana-she-teams-2025-07-15-19-45-14.jpg)
Telangana She Teams
అకతాయిలకు అవకాశం వస్తే సమయం, సందర్భం చూడకుండా ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం సర్వసాధారణమైంది.తాజాగా హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల మొహరం పండుగ కూడా జరిగింది. రెండు పండుగలతో నగరంలో సందడి నెలకొంటే అకతాయిలకు మాత్రం ఈ పండుగ తమలోని కామున్ని లేపింది. మొహరం, బోనాల పండుగ సందర్భంగా పలుచోట్ల అకతాయిలు ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షీటీమ్స్ కు దొరికిపోయారు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 478 మంది రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
Telangana She Teams
ఉత్సవాల సమయంలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే పనిగా పెట్టుకున్నారు చాలామంది ఆకతాయిలు. వారిని పట్టుకోవడానికి గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 14 బృందాల షీ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంతో మహిళా భక్తులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు 478 మందిఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు షీ టీమ్స్ అధికారులు.
Also Read: అబ్బా తమ్ముడూ.. Vivo నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. కెమెరా సూపరెహే!
వీరిలో ఎక్కువ మంది మైనర్లు, వృద్ధులే ఉండటం గమనార్హం. అదుపులోకి తీసుకున్న 478 మందిలో 386 మంది మేజర్లు, 92 మంది మైనర్లు ఉన్నట్లు ఉన్నారు. వీరిలో 288 మందిని హెచ్చరించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. మిగిలినవారిలో ఐదుగురికి జరిమానా విధించారు. ఒకరికి జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. ఇక, సహాయం కోసం షీ టీమ్స్‌ను డయల్ 100, లేదా 9490616555 వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
Also Read : భట్టికి బిగ్ షాక్..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్ నోటీసులు
Also Read : సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం..బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
Telangana bonalu | crime news | bonalu 2025 hyderabad | bonalu 2025 | she-team-focus