Hyderabad: ఆకతాయిల ఆటకట్టించిన షీ టీమ్స్.. హైదరాబాద్లో 247 మంది అరెస్ట్!
హైదరాబాద్ పోలీసులు ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. నాంపల్లిలో జరిగిన నుమాయిష్ 2025 ఎగ్జిబిషన్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 247 మందిని ‘షీ టీమ్స్’ అరెస్టు చేశాయి. 223 మంది మేజర్లు, 24 మంది మైనర్లున్నట్లు తెలిపారు. ఇద్దరికీ 2 రోజుల జైలు శిక్ష విధించారు.