/rtv/media/media_files/2025/08/25/rats-bite-nine-students-2025-08-25-16-38-39.jpg)
Rats bite nine students
బాలికల హాస్టల్లో(Girls Hostel) ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పడుకుంటే చాలు కరుస్తు్న్నాయి. ఇప్పటికే సుమారు తొమ్మిది మంది అమ్మాయిలను ఎలుకలు కరిచాయి. దీంతో విద్యార్థినీలు హాస్టల్లో ఉండాలంటేనే జంకుతున్నారు. ఈ విషయం విద్యాధికారుల దృష్టికి చేరడంతో కలకలం రేగింది.
ఇది కూడా చూడండి:Crime News : ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ
Rats Bite Nine People In Girl's Hostel
కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలంలో జరిగిందీ ఘటన. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ని విద్యార్థినిలను ఎలుకలు కరిచిన(rat-bite) ఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక కస్తూర్బా పాఠశాలకు చెందిన హాస్టల్లో విద్యార్తినీలు పడుకున్న సమయంలో ఎలుకలు హాల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే 9మంది విద్యార్థులను కరిచాయి. అయితే వెంటనే విద్యార్థులు విషయాన్ని ఎస్ ఓ మాధవికి తెలిపారు. అయితే ఈ విషయం బయటకి పొక్కితే బాగుండదని భావించిన ఆమె పిహెచ్ సీ కి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు తెలిసింది.
Also Read: TG Crime: కొంత గ్యాప్ అంతే.. అదే రిపీట్... రాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య...
ఈ విషయం ఆ నోట ఈ నోట మెల్లగా మీడియాకు తెలియడంతో వారు పాఠశాలకు చేరుకుని విద్యార్థినీల నుంచి వివరాలు సేకరించారు. వారు ఈ విషయాన్ని మండల ఎంఈఓ లక్ష్మీనారాయణ దృష్టికి వెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన కస్తూరిబా గాంధీ బాలికలకు వచ్చి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వైద్య బృందాన్ని పిలిపించి మరోసారి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.. తరుచు ఎలుకలు గాయపర్చడం తో విద్యార్థులు భయపడుతున్నారు. హాస్టల్లో ఎటు చూసినా ఎలుకలు సంచారిస్తున్నాయని వారు వాపోతున్నారు. ఎలకల భయం తో హాస్టల్లో ఉండాలంటే భయమేస్తుందని విద్యార్థినీలు వాపోతున్నారు.