Ganesh Chaturthi 2025: ఎల్లుండే వినాయక చవితి.. మీ ఇంట్లో ఈ 3 పనులు ఇప్పుడే ప్రారంభించండి!

ఈ సంవత్సరం చతుర్థి తిథి రేపు మధ్యాహ్నం 01:54 గంటలకు ప్రారంభమై ఆగస్టు 27 మ. 03:44 గంటలకు ముగుస్తుంది. ఉదయాది తిథి ప్రకారం.. ఈ పండుగ ఆగస్టు 27 బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ఇంటి శుభ్రత, పూజా సామాగ్రి, అలంకరణ సామాగ్రి వంటివి సిద్ధం చేసుకోవాలి.

New Update
Ganesh Chaturthi 2025

Ganesh Chaturthi 2025

విఘ్నాల తొలగింపునకు గణేశుడి రాక వచ్చేసింది. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గణేశ చతుర్థి(Ganesh Chaturthi 2025) కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు.. ఇది సంస్కృతి, సామాజిక స్పృహ, పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రతీక. పది రోజుల పాటు జరిగే ఈ గణేశ ఉత్సవం కోసం ప్రజలు చాలా రోజుల ముందు నుంచే ఉత్సాహంగా ఎదురుచూస్తారు. ఇది గణేశుడిని ఇంటికి ఆహ్వానించడానికి, పూజించడానికి, ఉపవాసం పాటించడానికి ఒక ప్రత్యేక సందర్భం. ఈ పండుగ కేవలం భక్తులను, దేవుడిని మాత్రమే కాకుండా.. కుటుంబం, స్నేహితులు, సమాజాన్ని కూడా ఒక తాటిపైకి తెస్తుంది. అందుకే దీనిని విశ్వాసం, సంస్కృతి, సమాజాన్ని ఒకే దారంతో కలిపే పండుగగా చెప్పవచ్చు. 

హిందూ క్యాలెండర్(Hindu Calender) ప్రకారం.. ప్రతి సంవత్సరం భద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేశ చతుర్థి ప్రారంభమై.. అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది. ఈ సంవత్సరం చతుర్థి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 01:54 గంటలకు ప్రారంభమై ఆగస్టు 27 మధ్యాహ్నం 03:44 గంటలకు ముగుస్తుంది. ఉదయాది తిథి ప్రకారం.. ఈ పండుగ ఆగస్టు 27 బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. అంటే గణేశ ఉత్సవం ప్రారంభం కావడానికి ఇప్పుడు కేవలం కొంత సమయం మాత్రమే మిగిలి ఉన్నాయి. బాప్పాను ఇంటికి తీసుకురావడానికి లేదా మీరు మొదటిసారి గణేశ చతుర్థి నాడు గణపతిని ప్రతిష్ఠిస్తున్నట్లయితే.. ముందుగా మీరు చేయాల్సిన ఏర్పాట్లు  కొన్ని ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

గణేశ ఉత్సవం ముందుగా చేయవలసిన పనులు:

ఇంటి శుభ్రత: గణేశ చతుర్థికి ముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. అనవసరమైన వస్తువులను బయట పడేయాలి. బప్పా రాకకు ముందు ఇల్లు శుభ్రంగా, సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పూజ గది, ఇంటి మూలలు, పూజ స్థలం, ప్రధాన ద్వారం శుభ్రం చేయడం తప్పనిసరి.

పూజా సామాగ్రి:గణేశ చతుర్థికి ముందుగానే పూజకు అవసరమైన అన్ని వస్తువులను మార్కెట్ నుంచి తెచ్చి పెట్టుకోవాలి. పూజా చౌకీ, క్లాత్, కలశం, దీపం, నెయ్యి వంటివి సిద్ధం చేసుకోవాలి.

అలంకరణ సామాగ్రి:గణపతిని ఇంటికి తీసుకురావడానికి ముందు ఇంటిని అలంకరించడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి రంగోలి కోసం అబీర్, లైట్లు, తోరణాలు వంటి వాటిని ముందుగానే తెచ్చి పెట్టుకోవాలి.

ఇది కూడా చదవండి: వినాయక చవితి నాడు ఎవరు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో మీకు తెలుసా?

శివ పార్వతుల కుమారుడైన గణపతిని వినాయక చవితి(vinayaka chavithi 2025) రోజు పూజిస్తారు. గణేశ ఉత్సవం ఒక గొప్ప పండుగ. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడు ప్రారంభమై.. పది రోజులు ఈ వేడుకను వైభవంగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులను ఒకచోట చేర్చి సంతోషంగా పంచుకునే సమయం. కళాత్మకత, ఆధ్యాత్మికత, పండుగ ఉత్సాహం ఈ వేడుకలో కనిపిస్తాయి. అందరూ గణేశుడి విగ్రహాలను ఇంట్లో లేదా పబ్లిక్ ప్రదేశాల్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించే గొప్ప హిందువుల పండుగ.

ఇది కూడా చదవండి: గణేషుడిని మండపానికి ఇలా తీసుకురండి.. తప్పక పాటించాల్సిన జాగ్రత్తలివే!

Advertisment
తాజా కథనాలు