/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t075855730-2025-11-08-08-00-17.jpg)
High tension in Erragadda late at night...BRS vs. Congress
BRS vs Congress:హైదరాబాద్ ఎర్రగడ్డ(hyderabad-erragadda) లో అర్థరాత్రి కలకలం రేగింది. ఓ ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బుని సిద్ధం చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. సమాచారం అందుకున్న ప్లయింగ్ స్క్వాడ్ వెంటనే స్పాట్ కి చేరుకుంది. ఆ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. ఆ ఇంటి వద్దకు భారీగా పోలీసులు కూడా చేరుకున్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేపడుతోంది . ఈ క్రమంలో ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్ కాలనీలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బులు పెట్టి.. ఓటర్లకు పంచుతున్నారని సమాచారం అందడంతో… ఎన్నికల అధికారులు మేజిస్ట్రేట్ స్థాయి అధికారితో కలిసి, భారీగా బందోబస్తు మధ్య సోదాలు నిర్వహించారు. ఇంట్లోని లైట్లు ఆర్పివేసి సోదాలు నిర్వహించడం పట్ల బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి… ఇంట్లోకి తమను కూడా అనుమతించాలని అధికారులను కోరారు. కానీ అధికారులు అనుమతించకపోవడంతో వాగ్వాదం జరిగింది. గంటసేపు సోదాలు జరుపుతున్నామంటూ హడావుడి చేసిన అధికారులు.. ఏమీ దొరకలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారులు, పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం..డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా..స్పాట్‌లో 8మంది
High Tension In Erragadda
అలాగే ఎర్రగడ్డలోని ప్రేమ్ నగర్‌లో భారత రాష్ట్రసమితి నేత జానీమియా ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టడం ఆందోళనకు దారితీసింది. జానీమియా ఇంట్లో డబ్బులు ఉన్నట్లు సమాచారంతో తనఖీలు నిర్వహించింది. దీంతో భారత రాష్ట్రసమితి కార్యకర్తలు నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగారు. మరోవైపు ఎర్రగడ్డలోని ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు భారత రాష్ట్ర సమితి నేతలు ఫిర్యాదు చేశారు. రూ. 6 కోట్ల నగదు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చారు. డబ్బులున్నట్లు సమాచారం రావడంతో కాంగ్రెస్ నేత ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. మీడియా సమక్షంలో తనఖీలు చేయాలని భారత రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రేమ్ నగర్‌లోని కాంగ్రెస్ నేత సాలం షౌజ్ ఇంటి వద్దకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సాలం షౌజ్ ఇంట్లో ప్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నగదు దొరకకపోవడంతో సాలం షౌజ్ ఇంటి నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. ఆయన ఇంటి వద్ద నుంచి భారత రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలను పోలీసులు పంపించివేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(jubliee hills by election) నేపథ్యంలో ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్ కాలనీలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బులు పెట్టి.. ఓటర్లకు పంచుతున్నారని సమాచారం అందడంతో... ఎన్నికల అధికారులు మేజిస్ట్రేట్ స్థాయి అధికారితో కలిసి, భారీగా బందోబస్తు మధ్య సోదాలు నిర్వహించారు. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ లోని ఓ ఇంట్లో భారీగా నగదు ఉంది, ఆ డబ్బుని ఓటర్లకు పంపిణీ చేసేందుకే తీసుకొచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానికులు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఎలక్షన్ కమిషన్ ఫ్లైయింగ్ స్వ్కాడ్ రంగంలోకి దిగింది. వారితో పాటుగా పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆ ఇంట్లో డబ్బు ఉన్నది లేనిది దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us