Heavy Rain: దంచికొడుతున్న వర్షం..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.