/rtv/media/media_files/2025/08/28/heavy-rains-2025-08-28-07-15-17.jpeg)
Heavy rain in the next hour..
BIG BREAKING: గడచిన కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రతి మూడు గంటలకు ఒకసారి నౌకాస్ట్ బులెటిన్ విడుదల చేస్తు వస్తోంది.. శనివారం సాయంత్రం 5 గంటలనుంచి ఏడు గంటల మధ్య తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటడంతో దక్షిణ ఒడిశా-గోపాల్‌పూర్ సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటలపాటు వర్షాలు పడుతాయని హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: HYD Rains : హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉప్పొంగుతున్న మూసీ.. డేంజర్ లో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్!
ముఖ్యంగా తెలంగాణలో ఈ రోజు సాయంత్రం 5 గంటలనుంచి ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, మంచిర్యాల, మెదక్, సిద్ధిపేట, సూర్యాపేట వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలలోని పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కి.మీల వేగంతో గాలులు, తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇది కూడా చూడండి: Hyderabad: ఉప్పొంగిన మూసీ... మునిగిన ఎంజీబీఎస్
అదే సమయంలో హైదరాబాద్, మహబూబ్ నగర్,రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో రానున్న రెండు మూడు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 41నుంచి -61 కి.మీ.ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిచి ముద్దయింది. మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. మూసీలో అంతకంతకు వరద పెరుగుతుంది. హైడ్రా రంగనాథ్ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఎంజీబీఎస్‌లో పరిస్థితిని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించి.. సిబ్బందికి కీలక సూచనలు చేశారు. 30 ఏళ్ల తర్వాత మూసీ ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.13 ఫీట్ల ఎత్తులో పారుతున్న మూసీ ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 ఫీట్ల ఎత్తులో మూసీ పారుతోంది. మూసీ వరద తాకిడిలో చిక్కుకుపోయిన 11 మందిని హైడ్రా సిబ్బంది రక్షించారు. ఎంజీబీఎస్ కు వరద పోటెత్తడంతో పలు బస్సులను మళ్లీంచారు.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు