Heavy rains: మూడు రోజులు కుమ్ముడే కుమ్ముడు.. అసలు బయటకు వెళ్లొద్దు

రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ఈ నెల 9వ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

New Update
Heavy rains in Pakistan

Heavy rains in Pakistan

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

గురువారం (ఆగస్టు 7) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా  కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం (ఆగస్టు 8) రోజు జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. శనివారం (ఆగస్టు 9)న కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాలు గత కొంతకాలంగా వర్షపాతం లోటుతో ఇబ్బంది పడుతున్న రైతులకు కొంత ఊరట కలిగించనున్నాయి.

మరోవైపు, హైదరాబాద్ నగరంలో కూడా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని, వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisment
తాజా కథనాలు