Telangana Rains: మరో మూడు రోజులు జోరు వానలు..ఐఎండీ వార్నింగ్! ఐఎండీ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, తెలంగాణలో వచ్చే 2-3 రోజులు వానలు కొనసాగవచ్చని అంచనా వేసింది. By Bhavana 02 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Telangana Rains: హైదరాబాద్ నగరాన్ని వరుణుడు మరోసారి పలకరించాడు. శుక్రవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు సాధారణంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై...జోరు వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, పటాన్ చెరు, కొండాపూర్, కొత్తగూడ, అమీర్ పేట, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, బోరబండ, మూసాపేట, కూకట్ పల్లి, మియాపూర్, లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. Also Read: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలోను భారీ వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. వానపడడంతో పలు చోట్ల రోడ్ల మీదికి నీళ్లు చేరి.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో . తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉంది. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో.. నవంబర్ 1వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. Also Read: కూతురు పేరును ప్రకటించిన దీపికా-రణవీర్..అర్ధం ఇదే.. మరో రెండు, మూడు రోజులు... కాగా.. ఇప్పుడు ఐఎండీ మరో కీలక హెచ్చరిక చేసింది తెలంగాణలో మరో రెండు, మూడు రోజులు వానలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. Also Read: లైంగికదాడి ఆరోపణలపై స్పందించిన నాగార్జున.. టెస్టులకు సిద్ధం అంటూ! ఈ నేపథ్యంలో ఈ నెల 4 వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని చెప్పింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో శనివారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. Also Read: గోదావరి పుష్కరాల తేదీ ఖరారు..ఈసారి ప్రత్యేకతలు ఇవే.. మంచిర్యాల, జయశంకర్ భూపాపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, మహమూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. Also Read: ఇష్టమొచ్చినట్లు హామీలు ఇవ్వకండి.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు #rtv #weather-updates #telangana-rains #hyderabad-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి