AP: గోదావరి పుష్కరాల తేదీ ఖరారు..ఈసారి ప్రత్యేకతలు ఇవే..

గోదావరి పుష్కరాలకు ముహూర్తం కుదరింది. కోట్లాదిలో తరలివచ్చే ఈ పుష్కరాలను జూలై 23, 2027 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం.  ఈసారి పుష్కరాలకు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.

New Update
x

Godavari Pushkaralu: 

భారతదేశంలో ముఖ్య నదులలో ఒకటి గోదావరి. పన్నెండేళ్ళకొకసారి  ఈ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు.  2015లో గోదారి పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ వీటిని నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సబంధించి స్థానిక నేతలు, సంబంధిత యంత్రాంగాన్ని  అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ముందస్తు కార్యాచరణ కూడా సిద్దం చేశారు అధికారులు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్లు తెలుస్తోంది. పుష్కరాల నిర్వహణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.

ఎప్పుడంటే..

గోదావరి పుష్కరాలు జూలై 23, 2027 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటకి 8 మంది కోట్ల భక్తులు వస్తారని అంచాన వేస్తోంది. ఈ క్రమంలో గోదావరి జిలాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. గోదావరి నది తీరాల్లో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రభుత్వం ప్రచారం చేయనున్నాది. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా ఉండగా... మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు అధికారులు. దానికి తోడు పుష్కరాలకు వచ్చ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా...ఇప్పటి నుంచే ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ కంట్రోల్ లాంటి ఆంశాల విషయంలో  ఏర్పాట్లు చేపట్టామని మంత్రులు తెలిపారు.

Also Read: Fashion: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత

Also Read: Movies: కూతురు పేరును ప్రకటించిన దీపికా-రణవీర్..అర్ధం ఇదే..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు