లైంగికదాడి ఆరోపణలపై స్పందించిన నాగార్జున.. టెస్టులకు సిద్ధం అంటూ!

లైంగికదాడి ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జున స్పందించారు. తనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదన్నారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సివుందన్నారు.

New Update
sd dd

Merugu Nagarjuna: లైంగికదాడి ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జున స్పందించారు. తనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదన్నారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సివుందన్నారు.

ఏ విచారణకైనా సిద్ధం..

ఈ మేరకు నాగార్జున మాట్లాడుతూ.. ‘నేను కూడా ఎస్పీని కలిసి ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరతాను. ఆమెను నేను శారీరకంగా వాడుకున్నానని, డబ్బులు తీసుకున్నానని చెబుతోంది. విచారణలో ఇదే నిజమని తెలితే నాకు ఉరిశిక్ష వేయండి. నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. ఏ టెస్టులకైనా సిద్ధం. నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేకమంది నా దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉంది. విచారణలో ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారో కచ్చితంగా బయటపడుతుంది. నేను పార్టీలో యాక్టివ్ గా ఉన్నానన్న కారణంతోనే కొంతమంది నా పైన కుట్ర చేస్తున్నారు. రాజకీయంగా నాతో శత్రుత్వం ఉంటే నన్ను చంపండి. కానీ ఇలాంటి దుర్మార్గపు కుట్రలకు తెర తీయొద్దు’ అని కోరారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు